ఒకప్పుడు సౌత్ సినిమాలకు నార్త్ లో ఎక్కువగా క్రేజ్ ఉండేది కాదు. అసలు సౌత్ సినిమాలు అంటే చిన్న చూపు ఉండేది. కాని కొన్ని సంవత్సరాలుగా సౌత్ సినిమాలు ఉత్తరాదిన పెద్ద ఎత్తున వసూళ్లు సాధిస్తున్నాయి. కొన్ని డబ్బింగ్ అయ్యి అక్కడి ప్రేక్షకులను అలరిస్తుంటే, మరి కొన్ని సినిమాలు రీమేక్ అయ్యి హిందీ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. ఇప్పటి వరకు పలు సౌత్ సినిమాు హిందీలో రీమేక్ అయ్యాయి. అందులో ఎక్కువ శాతం చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి.
ఎన్టీఆర్ ‘టెంపర్’ చిత్రం హిందీలో ‘సింబా’గా రీమేక్ అయ్యింది. ఎన్టీఆర్ కెరీర్ లో నిలిచి పోయే సినిమా ‘టెంపర్’, అలాంటి ‘టెంపర్’ చిత్రం హిందీలో ఎలా రీమేక్ చేస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ‘టెంపర్’ కు చిన్న చిన్న నార్త్ టచ్చింగ్స్ ఇచ్చిన మేకర్స్ ‘సింబా’ను తెరకెక్కించారు. రణ్ వీర్ సింగ్, సారా అలీ ఖాన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను దక్కించుకుంది.
విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. బాలీవుడ్ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరడం చాలా కామన్ అయ్యింది. కాని రణ్ వీర్ సింగ్ మూవీ అది కాకుండా ఒక రీమేక్ మూవీ ఇంత త్వరగా 100 కోట్లను వసూళ్లు చేయడం గొప్ప విషయంగా బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే పలు సౌత్ చిత్రాలు అక్కడ వంద కోట్ల క్లబ్ లో చేరాయి. తాజాగా ‘టెంపర్’ కూడా బాలీవుడ్ 100 కోట్ల చిత్రాల జాబితాలో చేరి మన గౌరవంను పెంచింది.
Full View