ఎక్కడో ఆంధ్రాలోని ఓ మారుమూల పల్లెటూరిలో ఒక సాధారణ మహిళ ఒక పాట పాడింది. దాన్ని ఎవరో రికార్డ చేశారు. అది సోషల్ మీడియాలోకి వచ్చింది. కొన్ని రోజుల్లోనే వైరల్ అయిపోయింది. ఏఆర్ రెహమాన్ సహా ఎందరో స్పందించారు. ఆ పల్లె కోయిలను గొప్పగా ఆదరించారు. తన జీవితమే మారిపోయిందిప్పుడు. ‘ప్రేమికుడు’ సినిమాలోని ఓ చెలియా పాటను అద్భుతంగా పాడి ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి బేబీ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె మరో మంచి అవకాశం అందుకుంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించింది.
తెలుగుదేశం మహిళా నేత నన్నపనేని రాజకుమారి బేబీని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లింది. ఏపీ సచివాలయంలో చంద్రబాబును బేబీ తన కుటుంబ సభ్యులతో కలిసింది. ఆయన సమక్షంలో ఇటీవలే తాను పాడిన ‘మట్టి మనిషినండి నేను.. మాణిక్యమన్నారు నన్ను’ అనే పాటను ఆలపించింది. చంద్రబాబు అభినందనలు అందుకుంది. ఆయన శాలువా కప్పి బేబీని సత్కరించారు. కాసేపు బాబుతో ముచ్చటించిన బేబీ ఎప్పట్లాగే చాలా ఉద్వేగానికి గురైంది. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇటీవలే బేబీకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆమెను తన స్టూడియోకు తీసుకొచ్చి ఒక పాట పాడి రికార్డ్ చేయించాడు. ఆ పాటనే చంద్రబాబు దగ్గరా పాడింది బేబీ. సోషల్ మీడియా పుణ్యమా అని బేబీ యధాలాపంగా పాడిన ఒక పాట ఆమె జీవితాన్నే మార్చేసి సెలబ్రెటీని చేసేసింది.