వైరల్ పిక్: కవల పిల్ల‌ల‌కు ఒకేసారి పాలిస్తున్న చిన్మ‌యి..!

Update: 2022-10-19 05:40 GMT
సింగ‌ర్ చిన్మయి శ్రీపాద గురించి ప్ర‌త్యేక పరిచయాలు అవ‌స‌రం లేదు. గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంత పాపులర్ అయిందో.. సామాజిక అంశాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే మహిళగా అంతే పాపులారిటీ సంపాదించుకుంది. సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కుంటున్న లైంగిక వేదింఫులు.. సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలపై ఆమె గళం విప్పింది.

మీటూ ఉద్యమం సమయంలో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి బహిరంగంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో మిగతా మహిళలు కూడా తమ బాధలను ధైర్యంగా బయట ప్రపంచానికి చెప్పుకొనేలా చేసింది. తరచుగా ఆడ‌వారి హ‌క్కుల కోసం మాట్లాడుతూ ఫెమినిస్ట్ అనే ముద్ర వేయించుకుంది చిన్మయి.

హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ ర‌వీంద్ర‌న్‌ ను ప్రేమ వివాహం చేసుకున్న చిన్మయి.. ఆ త‌ర్వాత కూడా అలానే వ్యవహరిస్తూ వచ్చింది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా మహిళలపై జరుగుతున్న దాడులపై సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.

ఆమె ఇన్ స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ ఖాతాలలో న్యూస్ ఫీడ్ చూస్తే. వ్యక్తిగత విషయాల కంటే.. సామాజిక సమస్యలు - మహిళల హక్కుల గురించి షేర్ చేసిన పోస్టులే ఎక్కువగా కనిపిస్తాయి. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ.. త‌న‌కు సంబంధించిన విష‌యాలతో పాటుగా ఆడ‌వారి స‌మ‌స్య‌ల‌పై అవగాహన క‌ల్పిస్తూ ఉంటుంది.

ఇక పెళ్ళైన కొంత కాలానికి చిన్మయి క‌వ‌ల పిల్ల‌ల‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తన ఇద్దరు పిల్లల ముఖాలు కనిపించకుండా అప్పుడప్పుడు భర్తతో కలిసి ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల చిన్మయి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

చిన్మయి త‌న క‌వ‌ల పిల్ల‌ల‌కు పాలు ప‌డుతున్న‌ ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో ఇద్ద‌రికీ ఒకేసారి పాలిస్తూ కనిపిస్తోంది. పిల్లలు ఫీడింగ్ చేయడం ఇలా ఉంటుంది.. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. భుజాలు భిన్నమైన స్వరాన్ని కలిగి ఉంటాయి అని చిన్మయి ఈ పోస్టులో రాసుకొచ్చింది.

సెల‌బ్రిటీలు ఇలాంటి ఫొటోలు షేర్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి చాలా ధైర్యం కావాలి. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న చిన్మయి.. ఎంతో ధైర్యంగా పిల్లలకు పాలిస్తున్న పిక్ ని పంచుకుంది. అలానే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీసుకున్న ఏకైక పిక్ అంటూ మరో ఫోటోని చిన్మయి షేర్ చేసింది.

ఇకపోతే చిన్మయి తెలుగు తమిళ భాషల్లో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఎక్కువ పాపులర్ అయింది. గతేడాది వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో చిన్మయి తన భర్త రాహుల్ తో కలిసి తొలిసారిగా వెండితెర మీద తళుక్కుమంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News