బాహుబలి సినిమా తెర పైన కనిపించిన వాళ్ళనే కాదు.. తెర వెనుక పనిచేసిన వాళ్ళని కూడా స్టార్స్ ని చేసింది. సినిమాలో ఉన్న ఒక ప్రధాన క్రాఫ్ట్ సంగీతం కూడా ఈ సినిమా విజయంలో మంచి పాత్ర పోషించింది. బాహుబలి కి కీరవాణి ఇచ్చిన సంగీతం దేశం నలుదిక్కులా మారుమోగింది. అటువంటి సినిమాలో ఒక పాట పాడి తెలుగు వాళ్ళందరికీ ఎప్పటికీ పచ్చబొట్టులా గుర్తుండిపోయింది సింగర్ దామిని.
''2014 లో సూపర్ సింగర్స్ ఆడిషన్ కి వెళ్ళి నేను పాడిన కొన్ని పాటలను సిడి చేసి ఇచ్చాను. సూపర్ సింగర్ ప్రిలిమ్స్ వరకూ వెళ్లి ఎలిమినేట్ అయ్యాను. చాల బాధపడ్డాను అప్పుడు మంచి అవకాశం వచ్చినప్పుడు సరిగా చేయలేకపోయనందుకు. కానీ తర్వాత కీరవాణి ఆఫీసు దగ్గర నుండి ఫోన్ వచ్చింది, మీరు కీరవాణి దగ్గర పని చేస్తారా? అని అడిగారు. వెంటనే డబుల్ యెస్ అన్నాను. పచ్చబొట్టేసినా అన్న పాట నాకు ఊహించని అవకాశం ఎందుకంటే నేను తమిళ్లో తొందరగా రికార్డింగ్ చేసేశాను. కాని తెలుగు వెర్షన్ పాడటానికి మాత్రం చాలా సమయం పట్టింది. భయం వేసింది. ఈ పాటను 72 రోజులు రాశారు అనంత్ శ్రీరామ్ గారని చెబుతారు. అందుకే ఆ పాటను పాడ్డానికి నాకు టైమ్ పట్టింది'' అని చెబుతోంది దామిని. అంతేకాదు.. అసలు చివర వరకు ఈమె పాడిన వర్షన్ సినిమాలో ఉంటుందా లేదే అనే కన్ఫ్యూజన్ కూడా ఉందట.
''నిజానికి నేను పాడింది ట్రాక్ మాత్రమే. తరవాత మళ్ళీ అనుభవం ఉన్న సింగర్ తో పాడించాలి అనుకున్నారు. నాకైతే నా వర్షన్ ఫైనల్లో ఉంటుందని అనిపించలేదు. కాని పాటను విన్న రాజమౌళి గారు నా పాటనే ఫైనల్ చేశారు. ఈ పాట తెరపై చూసినప్పుడు అందరూ తమన్నానే పాడిందా అని అనుకున్నారు. అదే నాకు దక్కిన అతిపెద్ద ప్రశంస'' అని చెప్పింది. ఇప్పుడు సంగీతం పై మరింత పట్టు సాధించాలి అనే పట్టుదలతో చెన్నైలో ఏ.ఆర్.రెహమాన్ కె.ఎమ్. ఇన్ స్టిట్యూట్ లో వెస్ట్రన్ వోకల్స్ కోర్సు చేస్తుంది దామిని.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/