ఆ గాయ‌నిని కొవిడ్ 19 ఏమీ చేయ‌లేదు.. కార‌ణ‌మిదే!

Update: 2020-05-03 04:30 GMT
క‌రోనా క‌ల్లోలానికి ప్ర‌పంచం అల్లాడిపోతోంది. ముఖ్యంగా అగ్ర‌రాజ్యం అమెరికా వేలాది మ‌ర‌ణాల‌తో చిగురుటాకులా ఒణికిపోతోంది. అయినా అదేమీ ప‌ట్ట‌న‌ట్టు దేశాధ్య‌క్షుడు ట్రంప్ ఇష్టానుసారం ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంపై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న మాటేమో కానీ.. ప్ర‌పంచ వ్యాప్తంగా వీరాభిమానులున్న ప్ర‌ముఖ పాప్ గాయ‌ని మ‌డోన్నా చేసిన  ప్ర‌క‌ట‌న‌కు ఫ్యాన్స్ ఒక‌టే అవాక్క‌యిపోతున్నారు.61 ఏళ్ల ఈ అమెరిక‌న్ గాయ‌ని ఇన్ స్టాలో క్వారంటైన్ డైరీ సిరీస్ అంటూ ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేసింది.

``న‌న్ను క‌రోనా ఏమీ చేయ‌దు. ఎందుకంటే నాలో యాంటీ బాడీస్ ఉన్నాయి`` అంటూ సెన్సేష‌న‌ల్ ప్ర‌క‌ట‌న చేసింది మ‌డోన్నా. అంటే దీన‌ర్థం వైర‌స్ తో పోరాడి జీవించే శ‌క్తి- స‌మ‌ర్థ‌త ఈ ఏజ్ లోనూ త‌న‌కు ఉన్నాయ‌ని మ‌డోన్నా చెప్ప‌క‌నే చెప్పారు. ``డాక్ట‌ర్ ప‌రీక్షించారు. నా బాడీలో ప్రతిరోధకాలు (యాంటీబాడీస్) ఉన్నాయని తెలుసుకున్నాను. కాబట్టి రేపు కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళబోతున్నాను. నేను కార్ కిటికీ అద్దాన్ని కిందకు దించుతాను. COVID-19 గాలిలో ఊపిరి పీల్చుకోబోతున్నాను. అయ్య‌య్యో... సూర్యుడు ప్రకాశిస్తున్నాడని నేను నమ్ముతున్నాను`` అంటూ ఎంతో పోయెటిక్ గా చెప్పుకొచ్చింది ఆ మ్యాట‌ర్. మ‌డోనాకి క‌రోనా పాజిటివ్. ఆ క్ర‌మంలోనే త‌న శ‌రీరంలోకి యాంటీ బాడీస్ ని ప్ర‌వేశ పెట్టారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ యాంటీ బాడీస్ వ‌ల్ల ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయి? అన్న దానిపై స‌రైన క్లారిటీని వైద్యులు ఇవ్వ‌లేదు. ఇలాంట‌ప్పుడు మ‌డోన్నా ధైర్యం ఏమిటో అర్థం కావ‌డం లేదు. యాంటీబాడీస్ కొవిడ్ తో పోరాడి మ‌నిషిని ర‌క్షిస్తాయి అన్న‌ది ఇంకా ప్రూవ్ కాకుండా ఏమిటీ మొండి ధైర్యం ధీమా అన్నది ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న లండ‌న్ (బ్రిట‌న్) లో మ‌డోన్నా నివాసం ఉంటున్నారు. ఇక నిరంత‌రం అభిమానుల‌కు సామాజిక మాధ్య‌మాల ద్వారా ట‌చ్ లో ఉన్నారు. ఇదివ‌ర‌కూ `కరోనా వైరస్`ను గొప్ప ఈక్వలైజర్ అంటూ పొగిడేసిన మ‌డోన్నాపై నెటిజ‌నుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె గేట్స్ ఫిలాంత్రోపీ పార్ట్ నర్స్ కోవిడ్ -19 థెరపిటిక్స్ యాక్సిలరేటర్ కు ఒక మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చాక ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది.



Tags:    

Similar News