పాత విషయాన్నే కొత్తగా గుర్తు చేసుకుని కలతకు గురైంది బాలీవుడ్ నటి సోనా మహాపాత్ర. సామూహిక అత్యాచారం బెదిరింపులు తనకు కంటిపై కునుకు పట్టనివ్వలేదని తాను తన భర్త ఎంతో కుమిలిపోయామని సోనా తెలిపారు. సుల్తాన్ ప్రచార కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ తన విలేకరుల సమావేశంలో తనను తాను `రేప్` కి గురైన మహిళతో పోల్చుకున్నప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగింది. చాలా మంది ఆ వ్యాఖ్యలు సరికాదని వాదించారు. నటి సోనా మోహపాత్ర కూడా భాయ్ ని విమర్శించారు.
నిక్ జోనాస్ ను వివాహం చేసుకోవడానికి ప్రియాంక చోప్రా `భారత్` మూవీ ఆఫర్ ను వదులుకోవడంపై ఖాన్ ఘాటు వ్యాఖ్యలను సోనా కూడా ఖండించారు. ఆమె ప్రియాంక చోప్రాకు మద్దతు ఇచ్చిన తర్వాత సల్మాన్ ఖాన్ అభిమానుల నుండి సామూహిక అత్యాచారం బెదిరింపులు కూడా ఎదుర్కొన్నానని సోనా వెల్లడించింది. సల్మాన్ ఖాన్ ను ఖండించినందుకు తనకు రేప్ బెదిరింపులు ఎదురయ్యాయని... పోర్న్ వెబ్ సైట్ లలో మార్ఫింగ్ చేసిన ఫోటోలు దొరికాయని సోనా మహపాత్ర తెలిపారు.
సల్మాన్ భారత్ లో నటించడం కంటే .. నిక్ జోనాస్‌ను వివాహం చేసుకోవాలని పీసీ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థించిన సమయాన్ని సోనా మోహపాత్ర గుర్తుచేసుకుంది. సోనా మాట్లాడుతూ.. ``నేను సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక ప్రకటనలో నటించేందుకు వచ్చినప్పుడు నా స్టూడియోలోని డబ్బాస్ (లంచ్ బాక్స్‌లు)లో ప్రాణాపాయ బెదిరింపుల కథనాలు చూసాను.
అత్యంత భయంకరమైన ట్రోలింగ్ కు గురయ్యాను. నా కామెంట్లు వైరల్ అయ్యాయి. బెదిరింపు అక్కడితో ఆగలేదని.. అది గ్యాంగ్ రేప్ బెదిరింపుల రూపంలో మరింత తీవ్రమైందని పోర్న్ వెబ్ సైట్లలో తన ఫోటోలు మార్ఫింగ్ చేసారని ఆమె పేర్కొంది.
సోనా తన బాధాకరమైన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. సంగీతకారుడు-భర్త రామ్ సంపత్ సహా తన కుటుంబం కూడా తనను ఎలా ప్రభావితం చేసిందో సోనా పేర్కొంది. ``ఇది భయంకర అనుభవం. ఇది కేవలం అభిమానులతో రూపొందించని డిజిటల్ ఆర్మీ అని గ్రహించాం. ఇది ఆన్ లైన్ లో ఉండకుండా మహిళలను టార్గెట్ చేస్తుంది. ఏదైనా ముందస్తు ప్రణాళికతోనే... ఈ మొత్తం గేమ్ లో పెయిడ్ కథలు చాలా ఉన్నాయి. ఇదంతా నా కుటుంబానికి భయంకర సన్నివేశాన్ని తెచ్చింది. నా భర్త ముందే నేను నా సోఫాలో ఏడుస్తూ ఉండేదానిని`` అని తెలిపారు.
తన డాక్యుమెంటరీ `షట్ అప్ సోనా`ను విడుదల చేస్తున్న సందర్భంలో సోనా మహపాత్ర.. సల్మాన్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ ఎదురైంది. ఈ సందర్భంగా తన బాధాకరమైన అనుభవాన్ని వెల్లడించింది.