వైభవంగా సింగర్ సునీత వివాహం

Update: 2021-01-10 07:37 GMT
ప్రముఖ సింగర్ సునీత వివాహం వైభవంగా జరిగింది. మ్యాంగోమూవీస్ అధినేత, బిజినెస్ ‌మెన్‌ రామ్‌ వీరపనేని సునీత మెడలో మూడుముళ్లు వేశారు. కొన్ని రోజుల కిందటే నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట.. జనవరి 9న ఒక్కటైంది. హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో సునీత-రామ్ వివాహం ఘనంగా జరిగింది.

ఈ వేడుక అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా.. వివాహానికి ముందు జరిగిన మెహందీ ఫంక్షన్ లో సునీత స్నేహితురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌‌ పాల్గొన్నారు. యాంకర్ సుమ కూడా వచ్చారు. వీరు అక్కడే ఉండి సునీతను పెళ్లి కూతురును చేశారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిని చూసిన అభిమానులు సునీతకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొత్త జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నారు.


Tags:    

Similar News