పువ్వు పరిమళం దాచినా దాగదంటారు. అలానే ఏ మనిషిలోనైనా టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని దాచినా దాగదు. మరి టాలెంట్ ఉన్నవాళ్ళందరూ సక్సెస్ కారెందుకు అంటే అదో డిఫరెంట్ టాపిక్. ఎందుకంటే టాలెంట్ తో పాటు.. హార్డ్ వర్క్.. సిన్సియారిటీ.. రైట్ యాటిట్యూడ్ లాంటివి ఒక నాలుగైదు కలిస్తే గానే నిజమైన సక్సెస్ రాదు. ఇవన్నీ పక్కన బెడితే సోషల్ మీడియా పుణ్యమా అని ఈమధ్య ఒక అద్భుతమైన సింగర్ టాలెంట్ బయటపడింది.
పొలం పనులు చేసుకుంటూ జీవించే 40 సంవత్సరాల బేబీ సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరు గ్రామం. ఆమె 'ప్రేమికుడు' సినిమాలోని 'ఓ చెలియా నా ప్రియ సఖియా' అనే పాట పాడడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఆ వీడియో ఏఆర్ రెహమాన్ వరకూ చేరడంతో ఆమెను అభినందిస్తూ ఆమె వీడియోను షేర్ చేయడంతో ఆమె మరింత పాపులర్ అయింది. ఇప్పటికే ఈమె చేత మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఒక పాట పాడించారు. సీనియర్ సంగీత దర్శకుడు కోటి కూడా బేబీ కి ఒక అవకాశం ఇస్తానని మాటిచ్చారట. దీంతో పాటుగా బేబీ ని కోటి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి తీసుకెళ్ళడం.. చిరంజీవి-సురేఖ దంపతులు ఆమెను ప్రశంసించడం తెలిసిందే.
తాజాగా ఈ గాయని లెజెండరీ సింగర్ ఎస్. జానకి గారిని కలిసింది. జానకమ్మ గారి గురించి చెప్పేదేముంది. ఆరు దశాబ్దాల సింగింగ్ కెరీర్.. 17 భాషల్లో నలభై ఎనిమిది వేలకు పైగా పాటలు పాడిన ఆమె నాలుగు ఉత్తమ గాయనిగా నాలుగు నేషనల్ అవార్డులు కూడా సాధించింది. ఆమెను 'నైటింగేల్ ఆఫ్ సౌత్' అంటారు. ఆమె కనుక నార్త్ ఇండియన్ అయి ఉంటే ఇప్పటికే భారతరత్న వచ్చి ఉండేదని ఆమె అభిమానులు అంటూ ఉంటారు. జానకమ్మ గారు బేబీని కలవడమే కాకుండా మనసారా హత్తుకున్నారు. పై ఫోటో చూస్తుంటే తెలియడం లేదూ ఆమె బేబీ టాలెంట్ ను చూసి ఎంత ముచ్చట పడ్డారో.. !