మన లిరిసిస్ట్ అక్కడ రాసేశాడు

Update: 2017-05-06 17:06 GMT
సాధారణంగా సినిమాలు తీసే డైరక్టర్లు.. మ్యూజిక్ కొట్టే కంపోజర్లు.. తమ మాతృబాషే కాకుండా ఇతర బాషల్లో కూడా తమ టాలెంట్ చూపిస్తుంటారు. దానికి అనేకమంది సహాయ సహకారాలు కూడా అందుతుంటాయి. కాని తెలుగులో పాటలు రాసేవారు.. ఇక్కడికే పరిమితం అవుతారు. ఎందుకంటే పాటల రచయితకు బాషతో పాటు అక్కడి కల్చర్ మరియు యాస కూడా తెలిస్తేనే పాటల్లో పద ప్రయోగాలను అర్ధవంతంగా చేయగలుగుతారు. అయితే ఇప్పుడు ఒక తెలుగు లిరిసిస్ట్ మాత్రం.. మనస్సు పెడితే ఎక్కడైనా కూడా రాయొచ్చు అని ప్రూవ్ చేశాడు.

మొత్తానికి దేశ ప్రధాని సైతం తెలుగు బిడ్డ కె.విశ్వనాథ్ గురించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందినందుకు అభినందించడం.. అదే సమయంలో దేశం అంతా తెలుగు తేజం రాజమౌళి తీసిన బాహుబలిని ఆనందిస్తున్న వేళ.. ఇప్పుడు తెలుగు పాటల రచయిత సిరాశ్రీ ఏకంగా హిందీలో పాట రాసేశాడు. సరదాగా కంపోజర్ ఒకరు ఒక ట్యూన్ చెప్పి.. దాని సిట్యుయేషన్ ఏంటో చెప్పాడట. అంటే చటుక్కున్న సిరాశ్రీ పాట రాసేశాడు. అది కూడా హిందీలో. ఆ పాట నచ్చేయడంతో.. వెంటనే పాడించేశాడు ఆ కంపోజర్. కట్ చేస్తే ఆ పాటను కంపోజ్ చేసింది.. మనోడు హిందీలో రాసింది.. ఏకంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సర్కార్ 3 సినిమా కోసం. అదిరిపోలా!!

''రోకో రోకో.. సోచ్ సే సైతాన్ కో రోకో'' అంటూ ఇప్పుడు సిరాశ్రీ రాసిన పాట.. ''తంబా'' పేరుతో సర్కార్3 అల్బమ్ లో రచ్చలేపేస్తోంది. ''నిజానికి నాకు సిట్యుయేషన్ చెప్పగానే.. మనకు తెలిసిన హిందీ ప్రావిణ్యంతో.. భావం కరక్టుగా రీచ్ అయ్యేలా కేవలం 1 గంటలో పాటను పూర్తి చేసేశాను. ఛాలెంజింగ్ గా పదాల అమరిక చేయాల్సి వచ్చినా ఎందుకో సులువుగానే పనైంది. కాని ఈ పాటను సినిమాలో పెడతారని నాకు తెలియదు. పాట రాసినందుకు ఎంత జాబ్ శాటిస్ఫాక్షన్ ఉందో.. ఆ పాట ఆల్బమ్ లో పెట్టినందుకు అంతకంటే ఎక్సయిటింగ్ గా ఉంది'' అంటున్నాడు సిరాశ్రీ. ఏదేమైనా 2017లో తెలుగు సినిమా టెక్నీషియన్లు చితక్కొట్టేస్తున్నారంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News