తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల.. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
గత నెల 24న న్యూమెనియాతో సీతారామశాస్త్రి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే మంగళవారం పరిస్థితి విషమించడంతో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు. వైద్య బృందం ఆయన త్వరగా కోలుకునేందుకు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందిస్తున్నా పరిస్థితి చేయిదాటిపోయింది.
సీతారామశాస్త్రి మరణవార్త విని సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని అనుకుంటుండగా.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడం సిరివెన్నెల పాటలను ప్రేమించే కోట్లాది అభిమానులను కలిచివేస్తోంది. సీతారామశాస్త్రి పప్రస్తుత వయసు 66 ఏళ్ళు. ఈయన 20 మే 1955న తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లిలో జన్మించారు.