పాటల సిరిసంపన్నుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు అన్నది అభిమానులు జీర్ణించుకోలేనిది. ఆయన కలం ఇక సిరాను చిందించక మౌనముద్రలో ఉంటుందన్నది తట్టుకోలేనిది. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో నేడు ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. నేటి ఉదయం భౌతిక ఖాయాన్ని సిరివెన్నెల ఇంటి నుంచి ఫిలింఛాంబర్ కి తరలించారు. అక్కడ వేలాదిగా అభిమానులు ఆయన కడచూపు కోసం తపించారు. సినీరాజకీయ నాయకులు సిరివెన్నెల పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. చాలామంది సిరివెన్నెలతో అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. అనంతరం మహా ప్రస్థానానికి యాత్ర కొనసాగింది. పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ నిప్పంటించారు. ఆయన అంతిమయాత్ర అలా ముగిసింది.
ఏపీ ప్రభుత్వం తరపున..
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప రచయిత సిరివెన్నెల అని మంత్రివర్యులు పేర్కొన్నారు. ఏపీ ప్రజల తరపున సిరివెన్నెల కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.