బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో సెలబ్రెటీలకు క్లీన్ చిట్

Update: 2019-05-14 08:23 GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. తెలుగు సినీ పరిశ్రమనే ఉక్కిరిబిక్కిరి చేసింది. మీడియాలో పతాక శీర్షిక అయ్యింది. మొత్తం టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ డ్రగ్స్ కేసు ఉవ్వెత్తిన ఎగిసి.. ఇప్పుడు ఊసురుమంది. టాలీవుడ్ ను అతలాకుతలం చేసిన ఈ కేసు చివరకు ఏమీ తేలకుండా చప్పున చల్లారింది. టాలీవుడ్ హీరోలు, దర్శకులు - ప్రముఖులంతా కేసు నుంచి తాజాగా సురక్షితంగా బయటపడ్డట్టు తెలిసింది.

తాజాగా టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు ఏమైందని సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ను ఓ సామాజిక కార్యకర్త అడిగాడు. ఈ ఫిర్యాదుతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎక్సైజ్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో సిట్ 4 చార్జిషీట్లు దాఖలు చేశారట.. చార్జిషీట్లో మొత్తం 62మంది పేర్లు ప్రస్తావించారు. ఈ 62మందిలో హీరోలు - హీరోయిన్స్ - దర్శకులు - సినీ ప్రముఖులు - సినీ ఆర్టిస్టులను విచారించారు. వారి గోర్లు, వెంట్రుకల నమూనాలను సిట్ సేకరించింది. అయితే తాజాగా టాలీవుడ్ హీరోలు - ప్రముఖుల పేర్లను చార్జిషీట్ల నుంచి సిట్ అధికారులు తొలగించారు. అంతే వారికి ఈ కేసు నుంచి క్లీన్ చిట్ ఇచ్చినట్టేనని స్పష్టమైంది.

డ్రగ్స్ కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం 12 కేసులను నమోదు చేసింది. రవితేజ - పూరి జగన్నాథ్  - సుబ్బరాజు - నవదీప్ - హీరో తరుణ్ - చార్మీ - ముమైత్ సహా చాలా మందిని విచారించి వారి రక్తనమూనాలు సేకరించారు. అయితే తాజాగా వీరందరి పేర్లను చార్జిషీట్ల నుంచి తొలగించి క్లీన్ ఇవ్వడం విశేషం..

*డ్రగ్స్ కేసు నుంచి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన టాలీవుడ్ ప్రముఖులు వీరే..

హీరోలు రవితేజ - తరుణ్ - నవదీప్ - తనీష్ - నందు - నటుడు సుబ్బరాజు - దర్శకుడు పూరిజగన్నాథ్ - కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు - హీరోయిన్లు చార్మీకౌర్ - ముమైత్ ఖాన్, - రవితేజ కారు డ్రైవర్ శ్రీనివాస్ - నటుడు నవపాద ధర్మారావ్ (చిన్నా)తోపాటు పలురువు ప్రముఖులను కేసు నుంచి ఉపశమనం కల్పిస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసును తెలంగాణ సర్కారు టాలీవుడ్ పెద్దల ఒత్తిడికి తలొగ్గి కావాలనే పక్కనపెట్టేసిందని.. నీరుగార్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Tags:    

Similar News