హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ''సీతా రామం''. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనేది దీనికి ఉపశీర్షిక. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన 'సీతారామం' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుని సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో ఈరోజు సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
'సీతా రామం' అనేది యుద్ధ నేపథ్యంలో సెట్ చేయబడిన బ్యూటిఫుల్ మ్యాజికల్ లవ్ స్టోరీ అని అర్థం అవుతోంది. ఈ ట్రైలర్ రామ్ మరియు సీతల మధ్య ప్రేమకథను అవిష్కరిస్తోంది. ఒక ఉత్తరాన్ని సీతా మహాలక్ష్మి కి అందజేయడానికి రష్మిక మందన్నా ఇండియాకి బయలుదేరడంతో ఇది ప్రారంభమైంది.
తరుణ్ భాస్కర్ సహాయంతో సీత ని వెతుకుతోంది రష్మిక. రామ్ గురించి తెలుసుకుంటే.. ఆమెని పట్టుకోవడం ఈజీ అవుతుందని భావిస్తుంది. 1965లో లెఫ్టినెంట్ గా ఉన్న రామ్ (దుల్కర్ సల్మాన్) మరియు సీత (మృణాల్ ఠాకూర్) మధ్య ఒక అందమైన ప్రేమ కథ నడిచిందనే విషయాన్ని తెలుసుకుంటుంది.
రామ్ - సీత మధ్య ఉత్తరాలతో ప్రేమాయణం సాగిందని తెలుస్తుంది. అయితే వీరి లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇద్దరూ విడిపోయారనే సందేహాలు కలుగుతున్నాయి. 'నేను ఇక్కడికి వచ్చింది నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోడానికి' అని రష్మిక చెప్పడాన్ని బట్టి చూస్తే.. ఆమెకు వారితో ఏదో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది.
రష్మిక ఆ లెటర్ ను సీతా మహాలక్ష్మికి అందజేసిందా లేదా? అది రాసింది ఎవరు? అందులో ఏముంది? అసలు సీతా రామ్ కు ఏమైంది? చివరకు వారి ప్రేమకథ ఎలా ముగిసింది? రష్మిక కు వాళ్ళతో ఉన్న సంబంధమేంటి? అనేది తెలియాలంటే 'సీతా రామం' సినిమా చూడాల్సిందే
కథంతా రెండు కాలాల్లో నడుస్తోందని తెలుస్తోంది. ఓవైపు దుల్కర్ - మృణాల్ మధ్య అందమైన లవ్ స్టొరీని చూపిస్తుంటే.. మరోవైపు రష్మిక వారి జీవితం గురించి తెలుసుకునే ప్రయాణాన్ని చూపుతుంది. దుల్కర్ - మృణాల్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. రష్మిక స్క్రీన్ మీద అందంగా కనిపించింది.
సుమంత్ - గౌతమ్ మీనన్ - ప్రకాష్ రాజ్ - భూమికా చావ్లా - శత్రు - సచిన్ ఖేడేకర్ - మురళీ శర్మ - వెన్నెల కిషోర్ - జిషు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. 'నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే.. కాశ్మీర్ ను మంచుకొదిలేసి వచ్చేస్తారా?' వంటి పలు సంభాషణలు బాగున్నాయి.
సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ అందించిన విజువల్స్ అత్యుత్తమంగా ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో విజువల్స్ స్థాయిని పెంచడమే కాదు.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేసాడు. దీనికి శ్రేయాస్ కృష్ణ అదనపు సినిమాటోగ్రఫీని నిర్వహించారు.
అద్భుతమైన పెర్ఫార్మన్సెస్.. అందమైన విజువల్స్ మరియు వినసొంపైన మ్యూజిక్ తో కూడిన ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. ఒక గొప్ప ప్రేమ కథను ఆవిష్కరించబోతున్న 'సీతారామం' సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
Full View