సూపర్ స్టార్ మహేష్ సెటైర్ కా బాప్. ఆయన సెటైర్ వేస్తే రిప్లై ఉండదు. పంచ్ వేస్తే అలా అంటుకుపోతుంది. మహేష్ సైలెంట్ గా ఉండేది మీడియా ముందు మాత్రమే. ఆన్ సెట్స్ లో ఎలా ఉంటారో? అన్నది అతనితో పనిచేసిన నటీనటులు..దర్శక..నిర్మాతలు ఎప్పటికప్పడు చెబుతూనే ఉంటారు. మహేష్ తో మాట్లాడటం అంటే మిషన్ గన్నుతో పెట్టుకున్నట్టే ఉంటుందన్నది చాలా మంది అభిప్రాయం.
ఆయన మాట్లాడేటప్పడు చెవులు మాత్రమే పనిచేయాలి..కాదని ఇంకేదైనా పనిచేస్తే ఎలా ఉంటుందో? పంచ్ పడిన తర్వాత తెలుస్తుందని అనుభవజ్ఞులు చెబుతుంటారు. మహేష్ ఎంత గొప్ప మాటకారి కాకపోతే ఇదంతా సాధ్యం. అలాంటి మహేష్ కే పంచ్ వేసింది కుమార్తె సితార. అవును..ఇటీవలే మహేష్ స్వీట్ డాటర్ సితారతో కలిసి డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్ కి హాజరైన సంగతి తెలిసిందే.
ఆషోని తండ్రి-కుమార్తెలిద్దరు తెగ ఎంజాయ్ చేసారు. పిల్లి గిన్నిలో వేడి వేడి పాలు తాగితే ఏమవుతుందని ఓ ప్రశ్న వేస్తుంది సీతాపాప. దానికి మహేష్ గెడ్డం పట్టుకుని సీరియస్ గా ఆలోచిస్తాడు. చివరిగా చించి చించి మూతి కాలిపోద్దమ్మా అంటాడు. దానికి సితార క్యూట్ గా కాదు అంటుంది. సరే మరేం? అవుద్ది అంటే? బౌల్ ఖాళీ అయిపోతుందని పంచ్ వేస్తుంది.
బ్యాక్ గ్రౌండ్ లో శెభాష్ శెభాష్ అంటూ వాయిస్ ఓవర్ వస్తుంది. జబర్దస్త్ తరహాలో జోక్ భలే పేలిందని ఆడియన్స్ అంతా పగలబడి నవ్వుతారు. మహేష్ కి ఇలాంటి సన్నివేశం ఎదురవ్వడం ఇదే మొదటిసారి కావొచ్చు. అదీ కుమార్తె చేతిలో కావడంతో ఆ సరదా మూవ్ మెంట్ని కూడా ఎంతో ఎంజాయ్ చేసాడు. తండ్రికి తగ్గ తనయ అని మురిసిపోయాడు.
మొత్తానికి సెటైర్లు..పంచ్ లు వేయడంలో! సితార తండ్రి నోటి నుంచి ఊడిపడినట్లే కనిపిస్తుంది. అంతేనా? సితార మంచి డాన్సర్ కూడా. సోషల్ మీడియా వేదికగా తన ప్రతిభను చాటుతూనే ఉంటుంది.
సర్కారు వారి పాటలో పెన్ని సాంగ్ కి సితార డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ పాట వీడియోని సోషల్ మీడియా వరకే పరిమితం చేసారు. సినిమా లెంగ్త్ పెరిగిపోవడంతో సితార డాన్స్ ని ఎడిట్ చేసి సినిమా రిలీజ్ చేసారు. ఆరకంగా సితార డెబ్యూ మిస్ అయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.