దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన్నా కీలక పాత్రలో తెరకెక్కిన సీతారామం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను అశ్వినీదత్ కూతురు స్వప్న దత్ నిర్మించారు.
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యిందని తెలుస్తోంది.
సీతారామం సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 6 లక్షల డాలర్లను వసూళ్లు చేసినట్లుగా అధికారిక సమాచారం అందుతోంది. ఈమధ్య కాలంలో ఒక మీడియం రేంజ్ సినిమా ఈ స్థాయి వసూళ్లు దక్కించుకోవడం గగనంగా మారింది.
సీతారామం జోరు చూస్తూ ఉంటే లాంగ్ రన్ లో అమెరికాలో మిలియన్ డాలర్లను దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది. యూఎస్ లో బింబిసార సినిమా జోరు అంతగా లేదు.. తెలుగు రాష్ట్రాల్లో బింబిసార సందడి చేస్తూ భారీ వసూళ్లు దిశగా దూసుకు పోతూ ఉంటే.. సీతారామం సినిమా ఓవర్సీస్ లో మ్యాజిక్ నెంబర్ మిలియన్ డాలర్ల వరకు చేరువ అవ్వబోతుంది.
దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ ల యొక్క నటన సినిమా స్థాయిని అమాంతం పెంచింది అనడంలో సందేహం లేదు. రష్మిక మందన్నా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. సినిమా కథ పై నమ్మకం ఉంచి అంతా కష్టపడ్డారు.. ఆ కష్టానికి ప్రతిఫలం ఈ వసూళ్లు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మహానటి సినిమా సమయంలోనే దుల్కర్ సల్మాన్ కు తెలుగు లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు రామ్ పాత్రలో దుల్కర్ ను చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు అనడంలో సందేహం లేదు. హీరోగా దుల్కర్ సల్మాన్ ముందు ముందు తెలుగు లో మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.