రొమాన్స్ ఈజ్ బ్యాక్: నాగార్జున

Update: 2022-08-11 10:39 GMT
అశ్వనీదత్ నిర్మాణంలో .. హను రాఘవపూడి దర్శకత్వంలో 'సీతా రామం' సినిమా రూపొందింది. విడుదలైన  ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన క్లాసికల్ గా చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ నాగార్జున చీఫ్ గెస్టుగా 'థ్యాంక్యూ మీట్' ను ఏర్పాటు చేసింది. ఈ వేదికపై నాగార్జున మాట్లాడుతూ .. "దత్తు గారి కంటే నేను ఎక్కువగా ప్రేమించేవారు  ఇద్దరు ఉన్నారు. వారే స్వప్న -  ప్రియాంక. చిన్నప్పటి నుంచి వాళ్లు నాకు తెలుసు. వాళ్లిద్దరూ అశ్వనీదత్ గారికి ఎంతో అండ.

'మహానటి' .. 'జాతిరత్నాలు' తరువాత 'సీతా రామం'తో ఇప్పుడు మరో విజయాన్ని అందుకున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ ఎప్పటి నుంచో ఉంది. ఆ బ్యానర్ గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ బ్యానర్లో నాన్నగారు చేశారు .. నేను 5 సినిమాలు చేశాను .. చిరంజీవిగారు చేశారు.

ఇలా ఎంతోమంది ఆ బ్యానర్ పై పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వచ్చారు. అలాంటి బ్యానర్ పేరును వాళ్లు నిలబెడుతున్నందుకు ఆనందంగా ఉంది. 'సీతా రామం' చూసి చాలా జెలస్ ఫీలయ్యాను .. ఎందుకంటే నాకు రావలసిన రోల్ దుల్కర్ కి వెళ్లింది.

ఈ సినిమా చూస్తుంటే గతంలో నేను చేసిన 'గీతాంజలి' .. 'మన్మథుడు' .. 'సంతోషం' వంటి రొమాంటిక్ సినిమాలు గుర్తుకువచ్చాయి. రొమాన్స్ ఈజ్ బ్యాక్ అనిపిస్తాయి. ప్రేమకథా చిత్రాలు నచ్చితే ఆడియన్స్  దానిని ఎక్కడి వరకూ తీసుకుని వెళతారో తెలియదు. ఈ సినిమాలో హీరోయిన్ చీరలు బాగున్నాయని  కూడా నేను స్వప్నకి కాల్ చేసి చెప్పాను. హను రాఘవపూడి ఈ సినిమాను గొప్పగా తీశాడనే చెప్పాలి. ముందుగా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఇంట్రవెల్ కి లాక్ చేసేశాడు.

ఇలాంటి సినిమాలు ఇప్పుడు చేయడానికి నిజానికి చాలా ధైర్యం కావాలి. ఈ మధ్య కాలంలో ఇంత బ్యూటిఫుల్ సినిమాను నేను చూళ్లేదు. దుల్కర్ ఎవరు గ్రీన్ ఛామర్ .. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. ఆయన నటనలో స్వచ్ఛతనే ఆయన ప్లస్ పాయింట్ గా నేను చెబుతాను. మీరు తీయండి .. మేము చూస్తాను అనే మాట ఆడియన్స్ వైపును వినిపిస్తోంది. ఈ సినిమా వసూళ్లు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయనే రిపోర్ట్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇతర భాషల్లోను ఈ సినిమాను చూస్తున్నారు .. అందుకు హ్యాపీగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News