తెలుగోళ్ల కోసం చాలా నేర్చుకుంటాడట

Update: 2016-11-24 17:30 GMT
తమిళ్ లో సూపర్ హిట్ అయిన రెమోను తెలుగులోకి తీసుకొచ్చేస్తున్నాడు హీరో శివ కార్తికేయన్. దిల్ రాజు బ్యానర్ పై వస్తుండడం రెమో రిలీజ్ తో పాటు.. ఇక్కడ క్రేజ్ క్రియేట్ కావడానికి కూడా బాగా కలిసొచ్చే విషయంగా కనిపిస్తోంది. యాంకర్ నుంచి కమెడియన్ గా.. ఆ తర్వాత యాక్టర్ గా మారిన ఈ హీరో.. తెలుగు మార్కెట్ పై చాలానే ఆశలు పెట్టుకున్నాడు.

'తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఇది ప్రారంభం అని తెలుసు. బాగా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నా. నేను చాలా నేర్చుకోవాలని తెలుసు. అందుకే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నా తర్వాతి 2-3 సినిమాలను కూడా తెలుగులోకి డబ్బింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాను. నాకు షార్ట్ టెర్మ్ గోల్స్ తో పని చేయడం ఇష్టం. ప్రస్తుతం నా లక్ష్యం ఇదే. నేను ఇక్కడ కొత్త కాబట్టి.. కంటెంట్ మాత్రమే రిజల్ట్ డిసైడ్ చేస్తుందనే విషయంపై క్లారిటీ ఉంది. తెలుగు ఆడియన్స్ కు ఏం కావాలో తెలుసుకుని.. వాటిని నా సినిమాలో ఉండేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నా. అవసరమైన వాటిని నేర్చుకునేందుకు నేను ఎప్పుడూ సిద్ధం' అంటున్నాడు శివ కార్తికేయన్.

రెమో మూవీలో అమ్మాయి రోల్ చేయడంలో చాలా థ్రిల్ అనిపించిందని.. అసహ్యంగా కాకుండా.. అందమైన అమ్మాయిగా కనిపించేందుకు చాలానే జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నాడు రెమో. రేపు రిలీజ్ కానున్న రెమో తెలుగు వెర్షన్ డబ్బింగ్ రిజల్ట్ పై.. శివకార్తికేయన్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News