రామ్ గోపాల్ వర్మతో తన అనుభవాలను అంటూ దర్శకుడు శివ నాగేశ్వరరావు పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. రాముతో తన వర్క్ ఎక్స్ పీరియన్స్ మరియు ఆయన వర్కింగ్ స్టైల్ ను గురించి శివ నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. క్షణం క్షణం సినిమా షూటింగ్ సందర్బంగా జరిగిన ఒక సంఘటన గురించి గతంలో ఇప్పటికే ఆయన చెప్పిన విషయాన్ని మనం చర్చించాం. ఇప్పుడు ఆయన అదే సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని వెళ్లడి చేశాడు. నటి హేమను ఈ చిత్రం సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.
నేను కో డైరెక్టర్‌గా చేసిన నేటి సిద్దార్థ సినిమాలో హేమ చిన్న పాత్రను చేసింది. ఆ పరిచయంతో రాము తీస్తున్న క్షణం క్షణం సినిమాలోని ఒక పాత్రకు ఆమెను సిఫార్సు చేశాను. శ్రీదేవి ఫ్రెండ్ పాత్రకు హేమను తీసుకోవడం జరిగింది. సెకండ్ హీరోయిన్ పాత్ర అంటూ హేమకు చెప్పాము. నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో చిత్రీకరణ ఉంటుంది రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో షూటింగ్ కోసం హేమ వచ్చింది. షూటింగ్ ముందు రోజు వచ్చింది. ఆ తర్వాత రోజు ఆమెకు సీన్స్ వివరించడం జరిగింది. తర్వాత రోజు చిత్రీకరణ చేశాం. ఒక్క రోజు షూటింగ్ పూర్తి అయిన తర్వాత మీ పాత్ర షూటింగ్ పూర్తి అయ్యింది.
ఛార్మినార్ కు వెళ్లి షాపింగ్ చేసుకుని తర్వాత రోజు మీరు వెళ్లండి అంటూ రైలు టికెట్ ఆమెకు ఇవ్వడం జరిగింది. సెకండ్ హీరోయిన్ పాత్ర అంటూ ఒక్క రోజు మాత్రమే షూటింగ్ చేశారు కదా అంటూ హేమ అడిగింది. ఆ సమయంలో సినిమా విడుదల తర్వాత నీకే అర్థం అవుతుందన్నాను. మరి నాలుగు రోజులు ఎందుకు అని అడిగితే హైదరాబాద్ వచ్చేందుకు ఒక రోజు రైలు ఆలస్యం వల్ల లేటు అయ్యే అవకాశం ఉంది. షూటింగ్ ఒక్క రోజులో పూర్తి కాకుంటే మరో రోజు అనే ఉద్దేశ్యంతో నాలుగు రోజుల డేట్లు ఆమె నుండి తీసుకున్నాం. సినిమాలో శ్రీదేవి కాకుండా ఉన్నా మరో లేడీ పాత్ర హేమ. కనుక ఆ పాత్రను సెకండ్ హీయిన్ పాత్ర అంటూ చెప్పాము అంటూ శివనాగేశ్వరరావు అన్నాడు.