హ్యూమ‌ర్ పుట్టాలంటే పారామీట‌ర్ ఇదీ

Update: 2019-07-02 07:13 GMT
కామెడీ పుట్టాలంటే పారామీట‌ర్ ఏది? ఏం చేస్తే కామెడీ పుడుతుంది? ఏం చేస్తే ఎమోష‌న్ పుడుతుంది? ఇది ఆల్వేస్ హాట్ డిబేట్ ప‌రిశ్ర‌మ‌లో. తాజాగా ఓ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ ఆ టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు. నిన్న‌టి సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రిగిన `బ్రోచేవారెవ‌రురా` స‌క్సెస్ వేడుక‌లో పాల్గొన్న మ‌జిలీ డైరెక్ట‌ర్ శివ‌నిర్వాణ‌ మాట్లాడుతూ ఆ గుట్టు కాస్తా లీక్‌ చేశారు.

శివ నిర్వాణ మాట్లాడుతూ ``నేను రాసేట‌ప్పుడు హ్యూమ‌ర్ రావాలంటే దేనిని పారామీట‌ర్‌గా తీసుకోవాల‌ని అని వెతుకుతాను. ఇటీవ‌ల నేను- వివేక్‌- గౌత‌మ్ తిన్న‌నూరి ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చాం. అందులో భాగంగా వివేక్‌ని త‌దుప‌రి ఏ సినిమా తీయ‌బోతున్నావు అని అడిగాను. ``ఏదైనా నా స్ట్ర‌గుల్‌, నా పెయిన్ నుంచి వ‌స్తుంది`` అని చెప్పాడు. త‌ను అలా చెప్ప‌డం నాకు బాగా న‌చ్చింది. రెండో సినిమా అన‌గానే ఆబ్లిగేష‌న్‌.. అడ్వాన్సులు అన‌కుండా చ‌క్క‌ని క‌థ రాసుకుని స‌క్సెస్ ద‌క్కించుకున్నాడు`` అని తెలిపారు. శ్రీ‌విష్ణు సినిమాల్లోనే ది బెస్ట్ ఇది. నివేద క్లాసిక్ డ్యాన్స్ అద్భుతం అని మ‌జిలీ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ప్ర‌శంసించారు.

ఇదే వేదిక‌పై మ‌రో ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ త‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూ.. టిక్కెట్లు దొర‌క్క సినిమా చూడ‌లేక‌పోయాను..2019లో నాకు న‌చ్చిన సినిమా అని చాలా మంది చెప్పారు. వివేక్ ఆత్రేయ‌నే నాకు ఒక టికెట్ ఇప్పిస్తే బావుంటుంద‌ని అడిగారు. 11గం.ల షోని ఏఎంబీలో చూస్తానన్నారు. ``ఇది వివేక్ ఆత్రేయ‌కి చెప్పుకోద‌గ్గ‌ స‌క్సెస్‌. ఆయ‌న ప్ర‌తి డీటైల్‌ను మూవీలో ఎంతో జాగ్ర‌త్త‌గా చూపారు. ఆయ‌న ద‌గ్గ‌ర చాలా నేర్చుకోవాలి. త‌న ప‌ర్స‌న‌ల్ జ‌ర్నీ కూడా నాకు తెలుస‌``ని అన్నారు. సురేష్ బాబు .. నాని లాంటి వారు సినిమా ముందే చూసి బావుంద‌ని అనడంతో న‌మ్మ‌కం రెట్టింపైంద‌ని.. ఎగిరెగిరి న‌వ్వుతార‌ని ప్రీరిలీజ్ లోనే చెప్పాన‌ని హీరో శ్రీ‌విష్ణు ఈ సంద‌ర్భంగా అన్నారు.  


Tags:    

Similar News