మ‌ణిర‌త్నం క్లాసిక్ ని ట‌చ్ చేయ‌డ‌మే రిస్క్!

Update: 2020-03-01 04:13 GMT
నేచుర‌ల్  స్టార్ నాని క‌థానాయ‌కుడిగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `టక్ జ‌గ‌దీశ్` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. `నిన్ను కోరి` త‌ర్వాత క్రేజీగా మ‌రోసారి క‌లిసి ప‌ని చేస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్న‌మే మెప్పించి.. అటుపైనా `మ‌జిలీ` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవ‌డంతో శివ‌ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. వ‌రుస‌గా రెండు బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ లు శివ‌కి టాలీవుడ్ లో మంచి అవ‌కాశాల‌ను తెచ్చి పెడుతున్నాయి. ఇక క‌థ‌ల ఎంపిక  ప‌రంగానూ శివ వెరీ ట్యాలెంటెడ్. స్క్రిప్ట్ సెల‌క్ష‌న్ తోనే స‌గం స‌క్సెస్ కొట్టేస్తుతున్నాడు.

సింపుల్ క‌థ‌ల్ని తెర‌పై అంతే అందంగా ఎమోష‌న్స్ తో చూపించ‌డం త‌న శైలి. తొలి రెండు సినిమాలు ఆ త‌ర‌హానే. ల‌వ్ అనే పాయింట్ కి ఎమోష‌న్  టచ్ ఇచ్చి స‌క్సెస్ అందుకున్నాడు. ఆ రెండు స్టోరీలు కూడా వైజాగ్ లో రియ‌ల్ గా జ‌రిగిన‌వే. వాటి ఆధారంగానే  స్క్రిప్ట్ ని క‌మ‌ర్శియ‌లైజ్ చేసి తెర‌కెక్కించాడు. ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న ట‌క్ జ‌గ‌దీష్ కి  స్ఫూర్తి ఎక్క‌డినుంచి? ఏ క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నాడు? అంటే ఆస‌క్తిక‌ర సంగ‌తులే లీక‌య్యాయి. ఈ సినిమా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `అగ్ని న‌ఛ్ఛ‌త్రం` అనే సినిమాని  స్ఫూర్తిగా తీసుకుని రూపొందిస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

`అగ్ని న‌ట్చ‌త్రం` .. అప్ప‌ట్లో `ఘ‌ర్ష‌ణ` టైటిల్ తో తెలుగులో విడుద‌లైంది. ట‌క్ జ‌గ‌దీశ్ క‌థాంశానికి ఈ సినిమాకు చాలా ద‌గ్గ‌ర పోలిక‌లు ఉంటాయ‌ట‌. ఎమోష‌న్స్ ప‌రంగా అంత డెప్త్ ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంత అన్న‌ది తెర‌పై చూడాల్సిందే. శివ తొలి రెండు సినిమాల‌కు ఏదో ఒక ఇన్సిండెట్ స్ఫూర్తి కాబ‌ట్టి ఈ  సినిమాల‌ విష‌యంలో అత‌డిపై ఎలాంటి కామెంట్లు వినిపించ‌లేదు. ఈసారి మ‌ణిరత్నం క‌ల్ట్ క్లాసిక్ నే టాచ్ చేస్తున్నాడంటే క్రిటిక్స్ నుంచి తీవ్ర‌ విమ‌ర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా క‌న్విన్స్ చేయ‌డం అన్న‌దే అత‌డి ముందున్న స‌వాల్. మ‌ణిర‌త్నం క్లాసిక్స్ ని ట‌చ్ చేయ‌డం రిస్క్ తో కూడుకున్న‌దే. వాటిని ఆయ‌నే తీసినా ఇప్పుడు క‌న్విన్స్ చేయ‌లేరు. అయితే శివ ఏమేర‌కు స‌క్సెస్ అవుతారు? అన్న‌ది చూడాలి.


Tags:    

Similar News