అక్కినేని నాగచైతన్య - సమంత జంటగా, దివ్యాన్ష మరో కీలక పాత్రలో నటించిన చిత్రం `మజిలీ`. `నిన్ను కోరి` ఫేం శివనిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక నేటి సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ సెంటర్ లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. వేడుక ఆద్యంతం అక్కినేని కోడలు సమంత గ్లింప్స్ ప్రత్యేకంగా మైమరిపించాయి. సామ్ వైట్ అండ్ బ్రౌన్ డిజైనర్ డ్రెస్ .. కాంబినేషన్ వజ్రాల హారంతో లక్ష్మీ దేవిలా మెరిసిపోయింది అక్కడ.
ఇక ఇదే వేదికపై అక్కినేని నాగర్జున- వెంకీ పక్క పక్కనే కూచుని తెగ గుసగుసలాడేస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. ఈ వేదికపై తొలి సీడీని వెంకటేష్ ఆవిష్కరించి నాగార్జునకు అందించారు. వేదికపై దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ-``నిన్ను కోరి చూసి నా కోసం ఒక కథ రాయమని చైతన్య అడిగారు. కానీ అప్పటికి నా దగ్గర కథ లేదు. ఒక ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది. అదే పూర్ణ క్యారెక్టరైజేషన్. దానిని పావుగంట పాటు చైకి వినిపించాను. ఇలాంటి కథను చేయాల్సిందేనని చైతూ అన్నారు. పూర్ణ పాత్ర నుంచి కథను రాసుకున్నా. ఆ తర్వాత శ్రావణి పాత్రను తీర్చి దిద్దేప్పుడు ఆ పాత్రకు సామ్ అయితే బావుంటుందనిపించింది. చైతన్య, సమంత ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఆ ఇద్దరూ కలిసి నటించే స్క్రిప్టు దొరికినందుకు ఆనందించారు`` అని తెలిపారు.ఈ చిత్రంలో చైతన్య నటన చూసి తనని కౌగిలించుకుని ఏడ్చేస్తారు. అంత గొప్పగా నటించాడు అని కితాబిచ్చారు శివ నిర్వాణ.
ఇక ఈ చిత్రంలో అలాంటి గొప్ప క్యారెక్టర్ ని తనకు ఇచ్చినందుకు చైతన్య తన దర్శకుడు శివకు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమలో నిజాయితీగా ఉండే వ్యక్తి తను అని ప్రశంసించారు. సమంత తన పాత్రలో అద్భుతంగా నటించిందని తెలిపాడు. ఈ కథ వినగానే సినిమా తీశాక కానీ ఇలా ఉంటుంది అని చెప్పలేం. కానీ కథను నమ్మి చేశామని చై వెల్లడించారు.