షూటింగుకి డుమ్మా కొట్టి స్టార్ హీరోకి షాక్ ఇచ్చిన హీరోయిన్..!

Update: 2020-06-22 11:10 GMT
కెరీర్ ప్రారంభించిన తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రకుల్ ప్రీత్‌సింగ్. టాలీవుడ్లో దాదాపు యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించింది. ఇటీవలే కింగ్ నాగార్జున పక్కన నటించి ప్లాప్ అందుకున్న తర్వాత ఈ భామ బాగా స్లో అయ్యింది. ఇక లాభం లేదని అటు బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన అమ్మడికి సౌత్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయట. తెలుగులో అయితే ఎవరు కూడా రకుల్ వైపు చూడట్లేదు. ఈ భామ ప్రస్తుతం అయితే కేవలం తమిళ ఇండస్ట్రీ పైనే ఆశలు పెట్టుకుంది. మొన్నామధ్య హీరో సూర్యతో కలిసి 'ఎన్ జి కె' సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బెడిసి కొట్టింది.

ఇక లాభం లేదని తమ్ముడు కార్తీతో కలిసి దేవ్ అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా బోల్తా కొట్టడంతో కెరీర్ పరంగా సందిగ్ధంలో పడింది. ఇక ఎట్టకేలకు స్టార్ డైరెక్టర్ శంకర్ తన 'భారతీయుడు-2' సినిమాలో అవకాశం ఇచ్చాడు. కానీ ఆ సినిమాలో రకుల్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేగాక అమ్మడికి తాజాగా హీరో శివ కార్తికేయన్ సినిమా 'అయలన్'లో అవకాశం వచ్చిందట. ప్రస్తుతం ప్లాప్ లలో ఉన్నా కూడా రకుల్ కి అవకాశాలు అడపాదడపా వస్తున్నాయి. ఇప్పుడైతే ఈ రెండు సినిమాల పై ఆశలు పెట్టుకుంది రకుల్. ఇక ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వడంతో సినిమాలన్నీ షూటింగులకు సిద్ధం అవుతున్నాయి.

ఇక షూటింగ్ షెడ్యూల్ వస్తే భారతీయుడు-2, శివ కార్తికేయన్ 'అయలన్' సినిమాల చిత్రీకరణలో పాల్గొంటానని మొన్నటి వరకు చెప్పింది రకుల్. అయితే తాజాగా షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనే టైంకి డుమ్మా కొట్టిందట. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రాలేనని అంటుందట. కానీ బాంబేలో ఫోటోషూట్లకు మాత్రం బాగానే పాల్గొంటుంది. ఈ దెబ్బతో శివకార్తికేయన్ టీమ్ కి గట్టి తగిలిందని చెప్పాలి. మరి అమ్మడి కారణంగా షూటింగ్ నిలిపేయాల్సి వస్తే చిత్రయూనిట్ వేరే హీరోయిన్ని తీసుకునే అవకాశం ఉంది. మరి నోటి దాక వచ్చిన అవకాశం చేజార్చుకోవడం.. అంటే రకుల్ ఉదాహరణగా నిలుస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News