అట్టడుగు స్థానం నుంచి స్టార్ ఎదిగిన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్. ఉద్యోగం కోసం ఒక టీవీ ఆఫీసుకి రోజూ సైకిల్ పై వెళ్లిన ఆయన, కొన్నేళ్లు తిరిగేసరికి అదే ఆఫీసుకి ఇంటర్వ్యూ ఇచ్చేందుకని విలాసవంతమైన ఆడి కారులో వెళ్లాడు. తన సొంత టాలెంట్ తో అంత వేగంగా ఎదిగాడు. ఆ విషయం గురించి తమిళ చిత్రసీమలో ఆసక్తికరంగా చెప్పుకొంటుంటారు. అయితే అట్టడుగునుంచి వచ్చాడనో మరేంటో తెలియదు కానీ... ఇప్పటికీ తమిళ చిత్రసీమలో కొద్దిమంది కథానాయికలు శివకార్తికేయన్ తో కలిసి నటించడానికి ఇష్టపడరట. కొత్త చిత్రం రెమో కోసం బోలెడుమంది కథానాయికల్ని పరిశీలించినా ఎవ్వరూ ఒప్పుకోలేదట. చివరికి అందులో నటించేందుకు కీర్తి సురేష్ ఓకే చెప్పింది.
ఇటీవలే ఆ సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది. ఆ వేడుకలో శివకార్తికేయన్ మాట్లాడుతూ కథానాయికలని నిష్టూరమాడాడు. ``మా సినిమాలో నటించడానికి చాలామంది కథానాయికలు ఒప్పుకోలేదు. వాళ్లందరికీ థ్యాంక్స్. వాళ్లు ఒప్పుకొనుంటే పాత్రకి పక్కాగా సరిపోయే కీర్తిలాంటి మంచి కథానాయికని మిస్సయిపోయేవాళ్లం`` అన్నాడు. కథానాయికగా నటించమని మొదట శ్రుతిహాసన్ ని అడిగారట. అయితే శివకార్తికేయన్ తో కలిసి నటించడానికి ఆమె ఒప్పుకోలేదట. ఆమెని ఉద్దేశించే శివ కార్తికేయన్ మాట్లాడాడని తమిళ సినీ జనాలు మాట్లాడుకొంటున్నారు.