అక్టోబరు 2న వద్దామనుకుంటే క్రౌడ్ ఎక్కువైపోయింది. 9న ఖాయం అనుకుంటుంటే రుద్రమదేవి వచ్చి పడింది. ఇక అక్టోబరులో వేరే డేట్లేవీ ఖాళీ లేవు. భారీ సినిమాలు పోటీలో ఉన్నాయి. దీపావళికి కూడా క్రౌడ్ ఎక్కువే ఉంటుందని ఆలోచించా ఏ చింతా లేకుండా నవంబరు చివరికి వెళ్లిపోయింది ‘సైజ్ జీరో’ సినిమా. నవంబరు 27న విడుదల అంటూ నెలన్నర ముందే డేటు ఇచ్చేశారు. ఇక ఆ డేటు మనకే.. పోటీ ఏమీ లేకుండా సోలోగా బరిలోకి దిగిపోదామని అనుకుంటే మాస్ రాజా వచ్చి ఫిట్టింగ్ పెట్టేశాడు.
దీపావళి ముందు వీకెండ్ లో, నవంబరు 25న విడుదల కావాల్సిన ‘బెంగాల్ టైగర్’ నెలాఖరుకు వాయిదా పడిపోయింది. రెండు రోజుల ముందు వరకు కొంచెం అనుమానాలున్నాయి కానీ.. ఇప్పుడా డౌట్లన్నీ తీరిపోయాయి. దీపావళికి ‘బెంగాల్ టైగర్’ సందడి చేయట్లేదు. ఐతే మధ్యలో వేరే డేట్లు ఖాళీ ఉన్నప్పటికీ పోయి పోయి నవంబరు నెలాఖరుకే డేటు మార్చుకున్నారు. దీంతో అనుష్క సినిమాకు ఫిట్టింగ్ పడిపోయింది. మాస్ రాజా సినిమాతో పోటీ అంటే కచ్చితంగా కలెక్షన్లపై ప్రభావం పడుతుంది. అలాగని మళ్లీ డేటు మారిస్తే.. జనాల్లో ఆసక్తి సన్నగిల్లిపోతుంది. మరి పీవీపీ వాళ్లు ఏం చేస్తారో?