ఏదైనా సినిమా కంటెంట్ ఎలా ఉంది? అని చెప్పడానికి ఎక్కువ నిడివితో సన్నివేశాలు చూడాల్సిన పని లేదు. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలు అన్నట్టుగా నాలుగైదు సన్నివేశాలు చూశాక టోటల్ రివ్యూ చెప్పొచ్చు. దానికోసమే టీజర్ లు రెడీ అవుతుంటాయి. బ్రోచేవారెవరురా- జాతిరత్నాలు లాంటి చిత్రాలు ఇదే కేటగిరీలో టీజర్లతో మెప్పించి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
ఇప్పుడు ఇదే కేటగిరీలో చేరుతుందా? అనిపించేలా స్కైలాబ్ టీజర్ మ్యాజిక్ చేస్తోంది. చాలా కాలానికి జూ.సౌందర్యగా తెలుగు నాట పాపులరైన నిత్యామీనన్ ఈ చిత్రంలో నటిస్తుండడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. నిత్యామీనన్ - రాహుల్ రామకృష్ణ- సత్యదేవ్ లాంటి స్టార్లు ప్రధాన బలంగా స్కైలాబ్ లాంటి ప్రయోగాత్మక ఫన్ ఫిల్డ్ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.
ఇందులో ప్రధాన పాత్రలు .. ఆయా పాత్రల ఆశయాలు గొప్పగా ఉన్నాయి. గ్రామంలో బోలెడంత ఫన్ ని జనరేట్ చేయనున్నారని అర్థమవుతోంది. జమీందార్ కూతురైనప్పటికీ జర్నలిజంలో తనేంటో నిరూపించుకోవాలనుకునే గౌరీ పాత్రలో నిత్యామీనన్ ఈ చిత్రంలో నటిస్తోంది. సత్యదేవ్ ఆనంద్ గా.. రాహుల్ రామకృష్ణ సుబేదార్ రామారావుగా కనిపించనున్నారు. స్కైలాబ్ భూమిపై పడిపోతుందన్న ప్రకటన ఈ ముగ్గురి జీవితాలను ఇతర గ్రామాలను ఎలా మారుస్తుందనేది ఫన్నీ సన్నివేశాలతో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది.
1979లో బండలింగంపల్లి గ్రామంలో స్కైలాబ్ అంతరిక్షం నుంచి పడిపోయినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గౌరి- ఆనంద్- రామారావు చుట్టూ సరదాగా సాగే కథ ఇది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భరణి- తులసి- విష్ణు ఓయ్- అనూష తదితరులు ఇందులో నటించారు. ఈ చిత్రాన్ని పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండడం ఆసక్తికరం. ఈ చిత్రానికి ఆదిత్య జవ్వాది కెమెరా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్ .. ప్రశాంత్ విహారి సంగీతం ప్లస్ కానున్నాయి. డిసెంబర్ 4న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Full View