సిన్న సినిమాలకు సెట్టవదు సిద్దప్పా..

Update: 2016-02-22 22:30 GMT
ఇప్పుడు భారీ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు సోలో రిలీజ్ లను ప్లాన్ చేసుకుని విడుదలవుతున్నాయి. చరణ్, అల్లు అర్జున్ ఇలానే ప్లాన్ చేసుకుంటుండగా.. పవన్, మహేష్ ల సినిమాలకు పోటీగా వచ్చేందుకు కూడా చిన్న సినిమాలు ధైర్యం చేయడం లేదు. ఒకట్రెండు వారాలు సోలో రిలీజ్ లను కలెక్షన్ల రూపంలో పెద్ద సినిమాలు బాగానే ఎంజాయ్ చేస్తున్నాయి. కానీ ఈ పరిస్థితి చిన్న సినిమాలకు మాత్రం దొరకడం లేదు.

పీవీపీ బ్యానర్ లో తెరకెక్కిన అడివిశేష్ మూవీ 'క్షణం'ను.. మార్చ్ 4న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ రోజున 'కళ్యాణ వైభోగమే' రిలీజ్ అవుతుడడంతో ఒంటరిగా థియేటర్లలోకి వచ్చే ప్లాన్ తో ఓ వారం ముందుకు జరిగి ఫిబ్రవరి 26కి సెట్ అయ్యారు. అప్పటికి 'పడేశావే' ఒక్కటే పోటీలో ఉంది. ఆ తరువాత 'మీకు మీరే మాకు మేమే'లతో పాటు మరికొన్ని సినిమాలు కూడా అదే డేట్ ని అనౌన్స్ చేశాయి. మొత్తం 8 సినిమాలు ఫిబ్రవరి 26 డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి.

ఇక మార్చ్ 4 పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 'కళ్యాణ వైభోగమే' ఒకటి మాత్రమే క్యూలో ఉంది అనుకోగా.. ఆ తర్వత మంచు మనోజ్ 'శౌర్య', ప్రవీణ్ సత్తారు మూవీ 'గుంటూరు టాకీస్', నారా రోహిత్ 'తుంటరి'లు కూడా మార్చ్ 4న వస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ లెక్కన సిన్న సినిమాలకు సోలో రిలీజ్ కు డేట్ దొరకడం అసాధ్యం అనే విషయం ఫిక్స్ అయిపోవచ్చు.

Tags:    

Similar News