ఎన్నాళ్లీ టామ్‌బాయ్‌ పాత్రలు తల్లీ...

Update: 2015-07-04 07:30 GMT
స్నిగ్ధ.. ఎంత చక్కగా ఉంది కదా పేరు. అమ్మాయి కూడా అంతే చక్కగా ఉంటుంది. కాకపోతే అబ్బాయిలా తయారవ్వడం ఈ అమ్మాయికి సరదా. 'అలా మొదలైంది' సినిమాతో ప్రేక్షకుల కళ్లల్లో పడింది స్నిగ్ధ. టామ్‌బాయ్‌లా కనిపించే ఆ సినిమా డైరెక్టర్‌ నందిని రెడ్డి.. తన క్యారెక్టర్‌నే స్నిగ్ధ ద్వారా చూపించిందని నందిని సన్నిహితులు చెప్పుకుంటుంటారు. ఐతే అబ్బాయిలా కనిపించే అమ్మాయి అంటూ 'అలా మొదలైంది'లో సెటైర్లు బాగా పేలడంతో ఆ తర్వాత కూడా ప్రతి సినిమాలోనూ ఇలాంటి క్యారెక్టర్లే వేస్తుండటంతో జనాలకు బోర్‌ కొట్టేస్తోంది. అందులోనూ ఈ మధ్య అయితే మరీ హెయిర్‌స్టైల్‌ కూడా పూర్తిగా అబ్బాయిలాగే కనిపిస్తోంది.

అందులోనూ తాజాగా రిలీజైన 'బస్తీ' సినిమాలో అయితే స్నిగ్ధ క్యారెక్టర్‌ టూమచ్‌గా ఉంది. సీసాలకు సీసాలు బీర్లు కొట్టేయడం.. కనిపించిన ప్రతివాడు ఆమెను అబ్బాయిలాగే ట్రీట్‌ చేయడం.. బ్రహ్మదేవుడు రాంగ్‌ బటన్‌ నొక్కేయడం వల్ల ఆమె పొరబాటున అమ్మాయిగా పుట్టేసినట్లు చూపించడం.. మొత్తం వ్యవహారమంతా అసహ్యం పుట్టేలా చూపించారు. ఇక సినిమాలో వచ్చే డైలాగుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే మంచిది. డైరెక్టర్‌ ఏమైనా రాసి ఉండొచ్చు. ఏదైనా తీస్తాననొచ్చు. కానీ తన మీద మరీ ఆ రేంజిలో సెటైర్లు వేస్తుంటే.. చాలా ఎబ్బెట్టుగా ఉండే సీన్లు తీస్తుంటే స్నిగ్ధకు ఏమీ అనిపించట్లేదా? అయినా ఇలాంటి టామ్‌బాయ్‌ క్యార్టెర్లు ఇంకెన్ని వేస్తుంది స్నిగ్ధ? ఇప్పటికే ఈ క్యారెక్టర్లు మరీ మొహం మొత్తేస్తున్నాయి. వేరే క్యారెక్టర్లేవైనా ట్రై చేస్తే బెటర్‌. డైరెక్టర్లు కూడా స్నిగ్ధ విషయంలో కొంచెం ఆలోచించాలి.

Tags:    

Similar News