మా నరేష్ మాట నిలబెట్టుకోవాలి

Update: 2019-03-11 14:30 GMT
మా నూతన అధ్యక్షుడిగా నరేష్ ఎంపికవ్వడంతో ఆ వర్గం మొత్తం సంబరాల్లో మునిగి తేలుతోంది. ఓ రెండు మూడు రోజులు ఈ హడావిడితోనే గడిచిపోయేలా ఉంది. ఇదంతా ఓకే కాని అసలైన సవాల్  నరేష్ కు ఇక నుంచి ఎదురు కానుంది. తాను ఏం చేస్తాడో మ్యానిఫెస్టోలో రూపొందించి దాని ద్వారా ప్రచారాన్ని చేసుకున్న నరేష్ ఇప్పుడు ఆ హామీలన్ని నిలబెట్టుకోవాలి. చాలా అపరిష్కృత సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో నరేష్ కు మద్దతు తెలిపిన రాజశేఖర్ కోలీవుడ్ లో విశాల్ నాజర్ ల తరహాలో కష్టపడి పనిచేసి ఓ ముద్ర వేయాలని పోలిక తీసుకొచ్చాడు.

ఇప్పుడు తనూ గెలిచాడు. సో ఖచ్చితంగా బలమైన ప్రభావం చూపేలా నరేష్ వర్గం చాలా కార్యకమాలు చేయాల్సి ఉంటుంది. శివాజీరాజా ఏవైతే చేయడంలో ఫెయిల్ అయ్యాడని నరేష్ హై లైట్ చేశాడో ఇప్పుడు అవి తన విషయంలో రాకుండా చూసుకోవాలి. కానీ నరేష్ ఇప్పుడు టాలీవుడ్ లోనే మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. గత రెండు మూడేళ్ళలో చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్స్ అధికంగా ఉన్నాయి.

 ఒకదాన్ని మించి ఒకటి పేరు తీసుకోవడంతో రాజేంద్ర ప్రసాద్ ను ఓవర్ టేక్ చేసి అవకాశాలు పసిగట్టడంలో ముందున్నాడు నరేష్. కాల్ షీట్స్ పట్టుకోవడమే దర్శకులకు కష్టంగా మారింది. అలాంటి నరేష్ ఇప్పుడు మాకు సంబందించిన వ్యవహారాల్లో అంతా తానై చూసుకోవాలి కాబట్టి కెరీర్ ని మా బాధ్యతలను బాలన్స్ చేసుకోవడం అంత సులభంగా ఉండదు. కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాల్సి రావొచ్చు. ఇవన్నీ నరేష్ ఊహించి ఉండడని కాదు కానీ పదవిలో ఉన్నంత కాలం ఇదో ముళ్లకిరీటమే.
Tags:    

Similar News