ప్రభాస్ కు అవార్డ్.. రచ్చ చేస్తున్నారే

Update: 2017-03-01 17:38 GMT
2013కు గాను.. తెలుగు సినిమాల్లో ఉత్తమ నటన కనబరిచినందుకు.. ''మిర్చి'' సినిమాకు కండలవీరుడు ప్రభాస్ ఇప్పుడు ఉత్తమ నంది పురస్కరాన్ని అందుకోనున్నాడు. ఆ విషయాన్ని ఈరోజే ఆంధ్ర ప్రదేశ్‌ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఇదే విషయమై సర్వత్రా రచ్చ జరుగుతోంది.

అసలు 2013లో వచ్చిన ఇతర సినిమాలను చూస్తే.. అత్తారాంటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్‌.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్‌ బాబు.. ధీటైన పెర్ఫామెన్సులే ఇచ్చారు. అయితే అభిమానులు మాత్రం.. ఫ్యామిలీ సినిమాలు చేసినందుకు ఈ ఇద్దరిలో ఎవరికైనా అవార్డును ఇచ్చుండాల్సిందని.. కేవలం ఫ్యాక్షన్ సినిమాలో నటించిన ప్రభాస్ కు ఎలా అవార్డిస్తారని కామెంట్లు చేస్తున్నారు. పైగా అదే ఏడాదికి 'సీతమ్మ వాకిట్లో' నటనకు మహేష్‌ కు ఫిలింఫేర్ అండ్ సైమా అవార్డులు కూడా వచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రభాస్ కు అవార్డును ఎలా ఇచ్చారంటూ నెటిజన్లు ఏకేస్తున్నారు.

ఇకపోతే అసలు అవార్డును పవన్ కు ఇవ్వాలని కొందరు తెలుగుదేశం పెద్దలు.. మహేష్‌ కు ఇవ్వాలని కొందరు రాజకీయ నాయకుటు పట్టుబడుతుంటే.. అనవసరమైన రచ్చ ఎందుకులే అని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభాస్ కు అవార్డ్ ఇచ్చిందని పొలిటికల్ ఏరీనాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News