నీవల్లే రేపులు అన్నారు.. దానికి సోఫియా రెస్పాన్స్ ఇదే!

Update: 2019-04-10 09:36 GMT
కూసింత కలాపోసన ఉన్న నెటిజనులకు బిగ్ బాస్ ఫేం సోఫియా హయత్ పేరు తప్పనిసరిగా తెలిసే ఉంటుంది.  నిత్యం ఏదో వివాదంలో సోఫియా పేరు వినిపిస్తూ ఉంటుందంటేనే అమ్మడు ఎంత 'డీసెంట్' అనేది మనం అర్థం చేసుకోవచ్చు.  ఈ వివాదాలు చాలవన్నట్టు కొద్ది రోజుల క్రితం న్యూడ్ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.. మరీవాటిని న్యూడ్ అనలేంగానీ ఒంటిమీద నూలుపోగు లేకుండా ఫోటో షూట్ చేసిందని చెప్పుకోవచ్చు.

ఈ ఫోటోలను చూసి ఫన్నీ కామెంట్లు పెట్టేవారు పెట్టారు కానీ కొంతమంది మాత్రం బండబూతులు తిట్టారు. అసలు నీలాంటి వారి వల్లే ఇండియాలో రేప్ కేసులు పెరుగుతున్నాయని ఘాటుగా విమర్శించారు.  "ఇండియాలో రేప్ కల్చర్ పెరగడానికి నిజమైన కారణం నువ్వు.  ఇండియా కనుక నీలాగా న్యూడిజం.. రేపిస్ట్ కల్చర్ ను ప్రమోట్ చేసేవారిపై చర్య తీసుకుంటే రేపిస్ట్ కల్చర్ కు ఎండ్ కార్డ్ పడుతుంది" అంటూ ఒక నెటిజనుడు కామెట్ చేశాడు.  అతని కామెంట్ కు స్పందించిన సోఫియా "నేను సహజంగా అన్నీ కామెంట్స్ చదవను. కానీ ఈ కామెంట్ ను ఒక డైలీ పేపర్ లో ప్రచురించారు. అతని రెస్పాన్స్ చూసి ఇలా ఆలోచించేవారు కూడా ఉంటారా అని నేను షాక్ అవుతున్నా. ఇలాంటివాళ్ళు నిజంగా ఉంటారా? ఇండియన్స్ అందరూ ఇలా ఉండరని మీరైనా చెప్పండి. అతని కామెంట్ పై మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి." అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

సోఫియా ప్రశ్నకు మెజారిటీ నెటిజనులు అతని అభిప్రాయం సరికాదని అన్నారు.  రేపులకు దీనికి సంబంధం లేదని అన్నారు.  కానీ కొందరు మాత్రం పబ్లిసిటీ కోసం నువ్వు వేసే వేషాలు కరెక్టా అని ప్రశ్నించారు. ఒక నెటిజనుడు "అతని అభిప్రాయం తప్పే.  కానీ అసలు నువ్వు ఈవిధంగా బట్టలు లేకుండా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నించాడు.


Tags:    

Similar News