మక్కాలో హీరోయిన్ పట్ల దారుణం??

Update: 2017-04-19 08:07 GMT
మోడల్.. బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన సోఫియా హయత్..  ఆ తర్వాత తనకు తానే దేవతగా ప్రచారం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నట్లు చెప్పిన ఈమె.. తాజాగా మక్కాను సందర్శించింది. మహిళల పట్ల ఎంతో గౌరవం ఇస్తారనే ఇస్లాం అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పిన సోఫియా.. పవిత్ర మక్కాలో పలువురు మగాళ్లు.. తనతో దారుణంగా ప్రవర్తించారని అంటోంది.

'మహిళలకు ఇస్లాం ఎంతో గౌరవం ఇస్తుంది. తన భార్య కాని వారిని మగవాళ్లు ముట్టుకోకూడదు. మహిళలతో క్రూరంగా ప్రవర్తించకూడదు. అందుకే ఇస్లాం అంటే నాకు ఇష్టం. కానీ ఇవే రూల్స్ ఏవీ మక్కాలో అమలు కావడం లేదు. అక్కడికి వెళ్లి నిబంధనలు మరిచిపోతున్నారు. క్యూలో నా వెనక ఉన్న వ్యక్తి చాలా అసభ్యంగా నన్ను టచ్ చేశాడు. మహిళలను తమ శారీరక శక్తితో హింసిస్తున్నారు. నాకు చాలా భయం వేసింది. కొందరి మధ్యలో ఇరుక్కుపోయిన నన్ను.. కొందరు మంచి మగవాళ్లు కాపాడారు. అనేక మంది మగాళ్లు పవిత్ర మక్కాలోనే ఖురాన్ ను పట్టించుకోవడం లేదు' అంటూ.. ఇంకా బోలెడన్ని ఆరోపణలు చేస్తూ.. సుదీర్ఘమైన కామెంట్ పెట్టింది.

అంతే కాదు తను చెప్పదలచుకున్న విషయాలను ఓ వీడియో రూపంలో కూడా తీసి పోస్ట్ చేసింది సోఫియా హయత్. మక్కాకు ఈమె తన కాబోయే భర్త వ్లాడ్ స్టానెస్క్ యూ తో కలిసి రావడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News