బిగ్‌ బాస్‌ హౌస్‌ లో రహస్యంగా డ్రగ్స్‌ వాడాడు!!

Update: 2018-10-31 05:10 GMT
బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో పలు చిత్రాల్లో నటించిన నటుడు ఎజాజ్‌ ఖాన్‌ తాజాగా డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు. ఒక హోటల్‌ లో ఎజాన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తో రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరకడంతో పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సమయంలోనే అజాజ్‌ ఖాన్‌ పై నటి సోఫియా హయత్‌ సంచలన ఆరోపణలు చేస్తోంది. వీరిద్దరు కూడా హిందీ బిగ్‌ బాస్‌ సీజన్‌ 7లో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో వీరిద్దరి గురించి పలు రకాల వార్తలు వచ్చాయి.

ఎజాజ్‌ ఖాన్‌ గురించి తాజాగా సోఫియా మాట్లాడుతూ షాకింగ్‌ విషయాలను చెప్పుకొచ్చింది. ఎజాజ్‌ కు డ్రగ్స్‌ అలవాటు ఇప్పట్లో వచ్చింది కాదని - ఎన్నో ఏళ్లుగా అది ఉంది. బిగ్‌ బాస్‌ ఇంట్లోనే ఎవరికి తెలియకుండా ఎజాన్‌ డ్రగ్స్‌ వాడాడు అంటూ సోఫియా షాకింగ్‌ విషయం బయట పెట్టింది. బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఇంట్లోకి అలాంటివి తీసుకు వెళ్లనివ్వరు. కాని ఎజాజ్‌ ఖాన్‌ చాలా తెలివిగా తన బాడీ బిల్డింగ్‌ కు సంబంధించిన వస్తువుల్లో డ్రగ్స్‌ ను దాచి తీసుకుని వచ్చాడు. వాటిని రహస్యంగా ఎజాజ్‌ వాడేవాడు, ఆ విషయాన్ని నేను చాలా సార్లు చూశాను. అతడు డ్రగ్స్‌ తీసుకున్న సమయంలో చాలా వింతగా ప్రవర్తించేవాడు.

ఎజాజ్‌ డ్రగ్స్‌ తీసుకున్న విషయం ఇంటి సభ్యులకు తెలియక పోవడంతో అతడు చేసే వింత ప్రవర్తనను ఫన్నీ  అంటూ అంతా ఎంజాయ్‌ చేసేవారు. నాకు మాత్రం చాలా భయంగా ఉండేది అంటూ సోఫియా చెప్పుకొచ్చింది. బిగ్‌ బాస్‌ హౌస్‌ లోనే కాకుండా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన డ్రగ్స్‌ కంటిన్యూ చేశాడు. నన్ను కూడా డ్రగ్స్‌ తీసుకోమని పలు సార్లు ఎజాజ్‌ బలవంతం చేశాడు. కాని నేను మాత్రం డ్రగ్స్‌ కు చాలా దూరంగా ఉంటూ వచ్చాను. ఒక రోజు హోటల్‌ గదిలో ఉన్న సమయంలో నా వద్దకు వచ్చి - డ్రగ్స్‌ తీసుకుంటే మజా వస్తుందని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కాని నేను మాత్రం అతడికి దూరంగా ఉన్నాను అంటూ సోఫియా పేర్కొంది. మరో వైపు ఎజాజ్‌ మాత్రం డ్రగ్స్‌ కేసులో నన్ను ఎవరో కావాలని ఇరికించారు. నన్ను - నా జీవితాన్ని నాశనం చేసేందుకు ఇలా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Tags:    

Similar News