అక్కినేని నాగార్జున తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడే. తెలుగు సినిమాలను డబ్బింగ్ చేయడమే కాదు. రచ్చగన్(రక్షకుడు) లాంటి డైరెక్ట్ తమిళ్ సినిమాలు చేశాడు. రీసెంట్ గా ఊపిరి మూవీ తమిళ్ లో 'తోళా' పేరుతో రిలీజ్ అయ్యి బాగా ఆకట్టుకుంది కూడా. ఇప్పుడు నాగ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ తమిళ్ లోకి వెళుతోంది.
గతేడాది సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన అంటూ నాగార్జున ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ సాధించేశాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. తెలుగులో చాలానే సంచలనాలు సృష్టించింది. ఎక్కువగా పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని.. ఇప్పుడు తమిళంలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. 'సోక్కాలి మైనర్' అనే పేరుతో అక్కడ రిలీజ్ చేయనుండగా.. ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలైపోయాయి. అయితే.. సోగ్గాడే చిత్రానికి నాగార్జున విభిన్నమైన నటనతో పాటు.. పక్కా పల్లెటూరి యాసతో మాట్లాడిన డైలాగ్స్.. ఊతపదాలు చాలా ముఖ్యం.
అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని.. తమిళ్ నేటివిటీకి తగ్గట్లుగా డైలాగ్స్ ను రాయిస్తున్నారట. అందుకే కాసింత టైం తీసుకున్నా.. చాలా జాగ్రత్తగా డైలాగ్స్ ను రాయించి.. డబ్బింగ్ కంప్లీట్ చేయిస్తున్నారని తెలుస్తోంది. పంచెకట్టుతో నాగార్జున అలరించనున్న సోక్కాలి మైనర్.. ఫిబ్రవరిలో కోలీవుడ్ ప్రేక్షకుల మందుకు రానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/