సీతారాముల పాత్రలంటే ఎప్పుడూ సంథింగ్ స్పెషల్ గానే ఉంటాయి. మరి రాముడి కేరక్టర్ లో నాగార్జున నటిస్తే ఎలా ఉంటుంది ? ఆగండాగండి.. నాగ్ ఏమీ పౌరాణిక సినిమా చేసేయడం లేదు లెండి. ఈ సారి కేవలం రాము అనే రోల్ చేస్తున్నాడంతే.
నాగార్జునకి రాముడి పేరుతో రోల్స్ చేయడం కొత్తేం కాదు. గతంలో కూడా రాముడొచ్చాడు సినిమాలో బాగా చదువుకుని.. ఫారినిన్ నుంచి పల్లెటూరు వచ్చేసిన పాత్రలో కనిపించాడు. ఇప్పుడు మరోసారి సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో.. కుర్ర నాగ్ పాత్రకు రాము అని పేరు పెట్టారంట. ఇక నాగ్ కి జంటగా నటించిన లావణ్య త్రిపాఠి పాత్ర పేరు ఆటోమేటిగ్గా సీత అయిపోతుందిగా. ఈ విషయాన్నే యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వీరిద్దరి కేరక్టర్స్ ని పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. "సోగ్గాడే చిన్ని నాయన"లో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. హలో బ్రదర్ తరహాలో హిట్టవుతుందని ప్రస్తుతానికి ఫ్యాన్స్ బిలీఫ్.
కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి.. పి. రాంమోహన్, నాగార్జునలు నిర్మాతలు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. సంక్రాంతి కానుకగా ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. డేట్ ఇంకా ఫిక్సవ్వలేదు.