అఖిల్ పై ఆధారపడుతున్న నాగ్

Update: 2015-11-07 15:30 GMT
మరో మూడు రోజుల్లో అఖిల్ వచ్చేస్తున్నాడు. దీపావళికి టాలీవుడ్ ని రచ్చరచ్చ చేయబోతున్నాడు. అఖిల్ కి పోటీగా తెలుగు ఇండస్ట్రీలో ఒక మూవీ కూడా రిలీజ్ చేసే సాహసం చేయడం లేదంటే.. ఈ అక్కినేని వారసుడి క్రేజ్ అర్ధమవుతుంది. అరంగేట్రంలోనే నయా రికార్డులకు అఖిల్ సిద్ధమవుతున్న సమయంలో.. అభిమానులకు మరో సర్ ప్రయిజ్ ప్లాన్ చేశాడు నాగార్జున.

ప్రస్తుతం నాగ్ సోగ్గాడే చిన్ని నాయన మూవీలో నటిస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ అనే కొత్త డైరెక్టర్ తీస్తున్న ఈ సినిమా.. డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన టీజర్ ని లాంఛ్ చేసిన నాగ్.. అఖిల్ మూవీతో పాటు థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నాడు. అంటే.. అఖిల్ సినిమా చూసేవాళ్లకు.. సోగ్గాడి ట్రైలర్ బోనస్ అన్నమాట.

సాధారణంగా తమ కొడుకులను లాంఛ్ చేయడానికి తమ క్రేజ్ ని,సినిమాలను ఉపయోగించుకుంటారు స్టార్ హీరోలు. దశాబ్దాలుగా, తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ఇది. దీన్ని బ్రేక్ చేస్తూ.. కొడుకు సినిమాతో తన మూవీకి ప్రచారంం చేసుకోబోతున్నాడు నాగ్. అంటే అరంగేట్రంతో తండ్రికి హెల్ప్ చేస్తున్నాడన్న మాట. సో అక్కినేని ఫ్యాన్.. గెట్ రెడీ ఫర్ డబుల్ ట్రీట్ అన్ దీవాలీ.

Tags:    

Similar News