తెలుగు బిగ్ బాస్ లో పెద్దగా అంచనాలు లేకుండా మొదటి నాలుగు అయిదు వారాలు ఎవరికి అర్థం కాకుండా ఉన్న సోహెల్ అనూహ్యంగా బలం పుంజుకున్నాడు. అతడి కోపం అతడి బలహీనత అన్న వారు కొంత మంది ఉంటే అతడి కోపంకు ఆకర్షితం అయిన వారు కొందరు ఉన్నారు. చాలా సహజంగా ఉండే సోహెల్ ను ప్రేక్షకులు ఎక్కువగా అభిమానిస్తున్నారు. అభిజిత్ తర్వాత స్థానంలో సోహెల్ నిలవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. సోహెల్ అప్పుడప్పుడు కోపం చూపించడం వెంటనే అవతలి వారికి సారీ చెప్పి కూల్ అవ్వడం చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న వాటికి ఏడుస్తూ ఎమోషనల్ అనిపిపించుకున్న సోహెల్ అనూహ్యంగా ఫైనల్ 5 కు చేరుకున్నాడు.
ఈ సమయంలో సోహెల్ తన మనసులో ఉన్న కోరికను చెప్పాడు. హీరోగా ఇంతకు ముందు చేసిన సినిమాలు ఆడలేదు. నా సినిమా టికెట్లు నేనే కొనుక్కుని చూసిన రోజులు ఉన్నాయి. అలాంటి నాకు బిగ్ బాస్ అనేది చాలా గుర్తింపు తెచ్చింది. నాకు ట్రోఫీ రాకున్నా పర్వాలేదు. నేను బయటకు వెళ్లిన తర్వాత సినిమా తీస్తే జనాలు ఇది సోహెల్ గాడి సినిమా అంటూ థియేటర్లకు వస్తే చాలు అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఏ జాబ్ చేయలేను.. ఏ పని రాదు నటన మాత్రమే వస్తుంది. కనుక నేను మళ్లీ నటుడిగా హీరోగానే చేస్తాను. బిబి క్రేజ్ తో హీరోగా ఈసారి మంచి మార్కులు తెచ్చుకుంటాను అంటూ సోహెల్ నమ్మకంతో చెబుతున్నాడు. ఈ ఆదివారం ఎపిసోడ్ తో బిగ్ బాస్ పూర్తి అవ్వబోతుంది. మరి ఈయనకు ఎన్ని ఆఫర్లు వస్తాయో చూడాలి.