ఛాన్సులు లేక సోనాక్షి అలా చేస్తోందా?

Update: 2022-10-28 23:30 GMT
హీరోయిన్ల మ‌ధ్య పోటీ వాతావ‌ర‌ణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క‌ళ్లు మూసి తెరిచే లోపు ఒక‌రి అవ‌కాశం మ‌రొక‌రు ఎగ‌రేసుకుపోతారు. పోటీ వ‌ర‌ల్డ్ లో దూసుకురావాలంటే అంతే వేగంగా ప‌నిచేయాలి. నిర్ణ‌యాలు సైతం అంత‌కు మించి వేగంగా తీసుకోవాలి. లేదంటే పుణ్య కాలం కాస్త గ‌డిచిపోతుంది. ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు అంతే  వేగంగాను ప‌నిచేయాలి.

హీరోయిన్ గా రాణించాలంటే ఇంకా చాలా ర‌కాల టెక్నిక‌ల్ తెలిసి ఉండాలి. వార‌సురాళ్ల మ‌ధ్య పోటీ త‌లెత్తితే వాతావ‌ర‌ణం యుద్దాన్ని త‌ల‌పిస్తుంది. నువ్వెంతంటే?  నువ్వెంత అనుకునే స్థాయికి వివాదం చేరుతుంది. ఇక బాలీవుడ్ గురించి చెబితే రెండున్న‌రేళ్ల‌గా అక్క‌డ ప‌రిశ్ర‌మ ప‌రిస్థితి పూర్తిగా దిగ‌జారింది. స‌క్సెస్ రేట్ త‌గ్గిపోవ‌డంతో  సినిమా నిర్మాణం త‌గ్గింది.

ముఖ్యంగా మీడియం బ‌డ్జెట్ సినిమాలు బాగా త‌గ్గాయి. స్టార్ హీరోలు మూడు నాలుగేళ్ల‌కు ఒక సినిమా మాత్ర‌మే చేస్తున్నారు. వాళ్ల స‌ర‌స‌న టాప్ మోస్ట్ హీరోయిన్లే  ప‌నిచేస్తారు. అంత‌కుమించి కింద స్థాయి హీరోయిన్ తీసుకోవ‌డం క‌ష్ట‌మైన ప‌ని. దీంతో కొత్త వాళ్లు స‌హా పేరు సంపాదించిన  హీరోయిన్లు కూడా ఖాళీగా ఉండాల్సిన ప‌రిస్థితులొస్తున్నాయి.

తాజాగా ముకు పుడ‌కల సుంద‌రి సోనాక్షి సిన్హా తీరు చూస్తే అలాగే క‌నిపిస్తుంది. ఈ భామ‌కి కొంత కాలంగా స‌రైన  విజ‌యాలు లేక రేసులో  వెనుక‌బ‌డింది. అలా  వెనుక‌బ‌డ‌టంతో అవ‌కాశాల‌కు దూర‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో 'డ‌బుల్ ఎక్స్ ఎల్'..'కాకుడా' చిత్రాలున్నాయి. కొత్త క‌మిట్ మెంట్లు ఏవి లేవు. అందుకేనేమో బ్యూటీ ఇప్పుడు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల వైపు దృష్టి మ‌ళ్లించిన్న‌ట్లు క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం హ్యూమా ఖురేషీ తో  క‌లిసి డ‌బుల్ ఎక్స్ లో న‌టిస్తోంది. ఇందులో ఇద్ద‌రు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. సినిమా  ఆ రెండు పాత్ర‌ల చుట్టూనే తిరుగుతుంది. తాజాగా సోనాక్షి అప్ క‌మింట్ ప్రాజెక్ట్ కూడా ఇలాగే ప్లాన్ చేసింది. ఆమెకు తోడుగా వాణీ క‌పూర్ ని తెచ్చుకుని  'ఏగ‌ర్ల్ ఇన్ ద ఎల్లో సూట్ కేస్' చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతుంది.

ఇందులో సోనాక్షితో క‌లిసి వాణీ క‌పూర్ న‌టించ‌నుంది. ఇది లేడీ ఓరియేంటెడ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్  చిత్ర‌మే. దీనికి జాతీయ ఉత్త‌మ ద‌ర్శ‌కుడు ఆషీమ్ అహ్లువాలియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. సోనాక్షి  కొత్త క‌మిట్ మెంట్లు చూస్తుంటే హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు రాక‌పోవ‌డంతోనే ఇలా ప్లాన్ డ్ గా ఫేమ్ ఉన్న హీరోయిన్ల తో క‌లిసి ముందుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News