కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రీసెంట్ గా భైరవతో మంచి సక్సెస్ నే కొట్టాడు. టాక్ సంగతి ఎలా ఉన్నా కలెక్షన్స్ వర్షం కురింపించేసిందీ సినిమా. రీసెంట్ గా విజయ్ తన 61 సినిమా స్టార్ట్ చేశాడు. అట్లీ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టేశాడు. ఇప్పుడు విజయ్ 62వ సినిమాపై కూడా అంచనాలు మొదలైపోయాయి.
విజయ్ 62వ సినిమా క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ తో అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. తుపాకి.. కత్తిల తర్వాత రానున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ముందునుంచే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. అయితే.. ఈ సినిమాలో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా తీసుకున్నారనే టాక్ మొదలైంది. విజయ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అంటే కాంబినేషన్ భలే క్రేజీగా ఉంటుంది కానీ.. ఈ విషయంలో ఈ భామ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
మురుగదాస్ డైరెక్షన్ లో హాలిడే లాంటి హిట్ తోపాటు.. అకీరా అంటూ ఫ్లాప్ ను కూడా అందుకుంది సోనాక్షి సిన్హా. పైగా ఈ అమ్మడు మొదటగా చేసిన తమిళ మూవీ లింగా సూపర్ ఫ్లాప్. దీంతో మరోసారి కోలీవుడ్ సినిమా చేయడంపై ఆచితూచి అడుగులు వేస్తోందట. ఇప్పటికైతే మురుగదాస్ స్టోరీ లైన్ చెప్పినా.. ఈ దర్శకుడి దగ్గరే ఫైనల్ స్క్రిప్ట్ లేదని తెలుస్తోంది. మురుగదాస్ ఫుల్ నేరేషన్ ఇచ్చిన తర్వాతే.. తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయిందట సోనాక్షి.