మేకప్ రూమ్ లో సోనాల్ సెగలు స్టార్ట్

Update: 2016-09-08 11:30 GMT
ఢిల్లీ  బ్యూటీ కాబట్టి.. హిందీ సినిమాతో అరంగేట్రం చేసింది కాబట్టి సోనాల్  చౌహాన్ ని బాలీవుడ్ బ్యూటీ అనే అనాలి. కానీ అక్కడ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసేసింది ఈ బ్యూటీ. రెయిన్ బో అంటూ అరంగేట్రం చేయగా.. లెజెండ్ తో పండగ చేస్కును.. షేర్.. సైజ్ జీరో.. డిక్టేటర్ మూవీలతో హంగామా చేసేసింది.

ఆ తర్వాతైతే తెలుగులో ఏ సినిమా సైన్ చేయలేదు కానీ.. బాలీవుడ్ లో మాత్రం జాక్ అండ్ దిల్(ఫైనల్ చేయలేదు) అనే మూవీలో అమిత్ సాధ్.. అర్బాజ్ ఖాన్ లతో కలిసి నటిస్తోంది. ఆన్ స్క్రీన్ పై ఈ సుందరి అంత అందంగా కనబడ్డానికి సీక్రెట్ ఏంటో ఇప్పుడు చెప్పేసింది. చెప్పడం కాదు.. చూపించింది కూడా. వైట్ కలర్ ఔట్ ఫిట్స్ లో లోపలి అందాలను బయటపెట్టేస్తూ.. మేకప్ వేసుకుంటుంటే.. అసలు అందం అంతా అమ్మడిలో ఉందా.. మేకప్ తో మెరుగైందా అని డౌట్ రాక మానదు.

అలాగని భారీ మేకప్ సామాగ్రితో సోనాల్ చౌహాన్ లాంటి నేచురల్ బ్యూటీకి పెద్దగా పని ఉండదు. అందుకే సో సింపుల్ గా తక్కువ మేకప్ తోనే అందాలను అథరాలను మెరిసిపోయేలా చేసేస్తుంది. అయినా.. అన్నేసి సోకులు సూపిస్తుంటే.. ఇంకా మేకప్ గురించి మాట్లాడుకోవడం తెలివి తక్కువ కదూ!
Tags:    

Similar News