చ‌క్రాస‌నంతో సోనాల్ యోగా డే సెల‌బ్రేష‌న్

Update: 2021-06-22 04:37 GMT
శిల్పా శెట్టి- క‌రీనా క‌పూర్ - మ‌లైకా అరోరా లాంటి భామ‌లు ఫిట్నెస్ గురువులుగా.. దేవ‌తాసుంద‌రీమ‌ణులుగా అభిమానుల  హృద‌యాల్లో నిలిచారు. నేటిత‌రం లో ర‌కుల్ ప్రీత్ సింగ్ .. ప్ర‌గ్య జైశ్వాల్ లాంటి భామ‌ల‌కు ఫిట్నెస్ ప‌రంగా లుక్స్ ప‌రంగా గుర్తింపు ద‌క్కింది.

అయితే వీళ్ల‌తో పాటు మ‌రో భామ పేరు కూడా ఇటీవ‌ల ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు సుప‌రిచిత‌మైన సోనాల్ చౌహాన్ బెస్ట్ యోగా క్వీన్ గా మెరుపులు మెరిపిస్తోంది. ఇటీవ‌ల సోనాల్ ఇన్ స్టాని ప‌రిశీలిస్తే అక్క‌డ ర‌క‌ర‌కాల యోగా భంగిమ‌లు ఎంతో సంక్లిష్ఠ‌మైన‌వి ఆక‌ట్టుకుంటాయి. ఎంతో సుశిక్షితురాలు అయితే కానీ చేయ‌లేని ఎన్నో క‌ఠిన‌మైన అస‌నాలు ఉన్నాయి.

నిన్న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా సోనాల్ ఓ స‌రికొత్త అస‌నాన్ని ప‌రిచ‌యం చేసింది. ఇది చ‌క్రాస‌నం.. చాలా ప‌ర్ఫెక్ట్ గా అలా చ‌క్రంలా వొంగి బ్యాలెన్స్ చేసిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. గడియారంలో ముల్లులా... లయతో ఆ వైపు తిరగడం ... కాలాతీత సముద్రంలో తేలియాడే ఒక చుక్క ... ! అంటూ క‌విత‌ను అల్లింది సోనాల్. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.

 కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సోనాల్ చివరిసారిగా ది పవర్ చిత్రంలో కనిపించింది.  ఈ యాక్షన్ థ్రిల్లర్ జీ 5 లో డైరెక్ట్ డిజిటల్ విడుదలైంది. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్- శ్రుతి హాసన్ ఇత‌ర‌ ప్రధాన పాత్రల్లో నటించారు.
Tags:    

Similar News