ఫోటో స్టొరీ: సోనాలి అండ్ ఫ్రెండ్స్ బై హృతిక్

Update: 2018-08-05 11:33 GMT

బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే ప్రస్తుతం అమెరికా లో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.  సోనాలి తన ఫ్యామిలీతో పాటు బాలీవుడ్ లోని స్నేహితులు తనకు ఎంతో ధైర్యాన్నిస్తున్నారని - అండగా ఉంటున్నారని చెప్తోంది.    అదివారం నాడు ఫ్రెండ్ షిప్ డే సందర్భం గా తన స్నేహితులైన సుజానే ఖాన్ - గాయత్రి ఒబెరాయ్ లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఓ ఫోటో ను పోస్ట్ చేసి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపింది. ఇంతకీ ఫోటో తీసింది ఎవరని అనుకుంటున్నారు?  వాళ్ళందరికీ ఫ్రెండ్ అయిన హృతిక్ రోషన్.

ఈ ఫోటోలో సోనాలి పూర్తిగా గుండుతో కనిపించడం విశేషం. దాంతో పాటుగా ఓ పెద్ద మెసేజ్ ను కూడా పెట్టింది.  "ఇది నేనే.  ఈ క్షణంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను.  ఈమాట చెప్తే జనాలు నన్ను వింతగా చూసే అవకాశం ఉంది.   కానీ ఇది నిజం. ఎందుకో నేనే చెప్తాను.   నేను ప్రతి క్షణాన్ని ఎంతో విలువైనదిగా చూస్తున్నాను.. అందులో ఆనందం ఎక్కడుందో వెతుక్కుంటున్నాను.  నిజమే.. కొన్ని బాధ - నిరాశ అనిపించే క్షణాలు కూడా ఉన్నాయి కానీ నేను నాకిష్టమైన పనులు చేస్తూ.. నేను ప్రేమించే వాళ్ళతో - నన్ను ప్రేమించే వాళ్లతో సమయం గడుపుతూ సంతోషం గా ఉండే ప్రయత్నం చేస్తున్నాను.  నాకు తోడునీడగా నిలుస్తున్న స్నేహితులకు నేను సదా కృతజ్ఞురాలిని. వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్స్ లో ఉన్నప్పటికీ నాకోసం సమయం కేటాయించి నన్ను కలుస్తున్నందుకు, కాల్ చేస్తున్నందుకు, మెస్సేజ్ చేస్తున్నందుకు... సరిగ్గా చెప్పాలంటే నన్ను ఒక్క క్షణం కూడా 'ఒంటరిగా ఉన్నానే అనే భావన' రాకుండా ఉంచుతున్నందుకు.. చాలా సంతోషంగా ఉంది.  నిజమైన ఫ్రెండ్ షిప్ అంటే ఎంటో మీరు నాకు చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ.  మీరందరూ (ఈ ఫోటోలో లేని వారు కూడా.. మీకు తెలుసు కదా) నా లైఫ్ లో ఉండడం ఓ అదృష్టం గా భావిస్తున్నాను."

"నోట్: ఈమధ్య రెడీ అయ్యేందుకు నాకు పెద్దగా సమయం పట్టడం లేదు ఎందుకంటే జుట్టు లేదు కదా!  BaldIsBeautiful #FindThePositive #OneDayAtATime "
Tags:    

Similar News