ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 'ఈ =ఎంసి స్క్వేర్' లాంటి మామూలు బుర్రలకే కాదు.. ఐటీ, ఐఐటీ బుర్రలకు కూడా సరిగ్గా అందని ఫార్ములాలు కనిపెట్టడమే కాకుండా మంచి కొటేషన్స్ కూడా చెప్పాడు.. అందులో ఒకటి 'యూ నెవర్ ఫెయిల్ అన్టిల్ యు స్టాప్ ట్రయింగ్'. నువ్వు ప్రయత్నం ఆపనంతవరకూ నువ్వు ఓడిపోయినట్టు కాదట. మన చానల్స్ లో మేథావులు చెప్పే మాటలను నమ్మచ్చో లేదో గానీ ఈ పెద్దాయన చెప్పిన మాటలను ఖచ్చితంగా నమ్మొచ్చు! మరి ఈ కొటేషన్ ను నిజంగా ఫాలో అవుతోంది బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే.
హిందీ సినిమాలతో పాటు పలు తెలుగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సోనాలి బెంద్రేకు రీసెంట్ గా క్యాన్సర్ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. ఆమె ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, తను క్యాన్సర్ పై పోరాడేందుకు నిర్ణయించుకున్నానని చెప్పింది. మన టాలీవుడ్ హీరో, హీరోయిన్ల దగ్గరనుండి ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కూడా.
సోనాలి బెంద్రే ప్రస్తుతం న్యూ యార్క్ లో ఉంటూ మెడికల్ ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. సోనాలి వదిన, బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన సృష్టి బెహెల్ సోనాలి గురించి రీసెంట్ గా మాట్లాడుతూ 'సోనాలి తనకెదురైన ఛాలెంజ్ ను స్వీకరించి ధైర్యంగా మనోనిబ్బరంతో పోరాడుతోందని, చాలా స్ట్రాంగ్ గా ఉందని' తెలిపింది. తమ కుటుంబమంతా సోనాలికి తోడుగా ఉన్నామంది. మరి మనం కూడా సోనాలి క్యాన్సర్ పై చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలని, మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.