ఏజ్ బార్ హీరోయిన్లు ఏం చేస్తుంటారు? ఇదో పెద్ద క్వశ్చనా.. సినిమాల్లో అక్క - వదిన - అమ్మ - అత్త కేరక్టర్స్ వేస్తూ ఉంటారు. ఇంట్లో అయితే.. తమ పిల్లలను చూసుకుంటూ ఉంటారు. అంతేగా అంటారా.. చాలావరకూ అది నిజమేలెండి. కానీ ఓ ఇద్దరు మాత్రం వాళ్లు అమ్మలుగా మారాక.. తల్లిగా ఆ అనుభవాలన్నీ కలిపి పుస్తకాలు రాసేశారు.
ఓ తరం వెనుక అయితే పొడుగు కాళ్ల సుందరిగా, కొంచె ఫ్లాష్ బ్యాక్ లో అయితే యోగా టీచర్ గా శిల్పాశెట్టి తెలుసు. కానీ ఇప్పుడీ భామ ఓ బుక్ రాసేసింది. ఆ పుస్తకం పేరు 'ది గ్రేట్ ఇండియన్ డైట్'. ఫిట్నెస్ గురించి చాలా మంది తనను సలహాలు అడగడంతో ఇన్ స్పైర్ అయిందట శిల్ప. అయితే.. అమ్మయ్యాక బాగా పెరిగిపోయానని, అది తగ్గడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు చేసుకున్నానని చెబుతోంది. మరి అందరూ న్యూట్రీషియన్ - డైటీషియన్ దగ్గరకు వెళ్లలేరు కదా.. అందుకే వారి కోసం ఓ బుక్ రాసేసింది శిల్పాశెట్టి.
ఇక సోనాలి బింద్రే అయితే.. పుస్తకాలుు రాయడమే పనిగా పెట్టుకున్నట్లుంది. ఆ మధ్య మిసెస్ ఫన్నీ బోన్స్ అంటూ.. జోక్స్ బుక్ రాసింది. ఇప్పుడేమో అమ్మల కోసం ప్రత్యేకంగా 'ది మోడర్న్ గురుకుల్' అనే పుస్తకాన్ని రాసేసి, ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేసింది. పిల్లల పెంపకం విషయంలోఅమ్మలకు బోలెడు సలహాలు ఉంటాయట ఇందులో. వీటిలో చాలావరకూ సోనాలి సొంత అనుభవాలే కావడం విశేషం.