తారస్థాయికి చేరిన సోనమ్ ఫ్యాషన్

Update: 2017-06-18 09:31 GMT
మె స్టార్ కిడ్ కావచ్చు కానీ ఆమె స్టార్ కావడానికి వాళ్ళ నాన్న స్టార్ స్టేటస్ ఏమంత ప్లస్ అయినట్లు లేదు సోనమ్ కపూర్ కు. ‘సావరియా'తో తన కెరియర్ ను మొదలిపెట్టి ‘దిల్లీ 6’ తో గుర్తింపు చేచ్చుకొని ‘నీర్జా’ వరకు తన ప్రయాణం చాల మలుపులు తిరిగిందిఅనే చెప్పాలి. తను నటించిన చాలా సినిమాలు ఫ్లాప్లు కావడంతో సోనమ్ కు ఎవరూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఇవ్వలేదు కానీ తన స్టైల్ - ఫ్యాషన్ - గుర్తింపు కోసం తను పడ్డ కష్టం అన్నీ కలిపి ఇప్పుడు సోనమ్ కపూర్ ను స్టార్ ని చేశాయి.

సోనమ్ కపూర్ ను ఫ్యాషన్ దివా గా చెప్పుకుంటారు బాలీవుడ్ ఇండస్ట్రి లో.  ఫ్యాషన్ లో విశ్వసుందరిలు కూడా ఆమెతో పోటీకి రావడానికి భయపడతారు. ఇక్కడ మీరే  చూడండి ఒక బ్రిటిష్ యువరాణి లా స్టైలిష్ హెడ్ గేర్ పెట్టుకొని డిజైన్ గౌన్ వేసుకొని రాకుమార్తే లా ఫోజ్ ఇచ్చింది. హెయిర్ స్టైల్ కూడా పాతకాలపు బాబ్ హెయిర్ స్టైల్ తో దానికి సరిపడే మేకప్ తో అందం ఠీవి రెండు కలగలిపి రొయల్ లుక్ లో అందరిని మాయచేసింది.

నీర్జా సినిమా హిట్ తరువాత చేస్తున్న సినిమా రాజకుమార్ హీరాణి నిర్మిస్తిన్న సంజయ్ దత్త్ బయో పిక్ లో నటిస్తుంది. ఇంకా అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘పాడ్ మాన్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా మంచి నటనకు చూపించదగిన పాత్రలే కావడంతో సోనమ్ ఇప్పుడు ట్రాక్ బాగానే నడుస్తుంది అనుకోవచ్చు. ఈ పాడ్ మాన్ లో అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటించబోతున్నారు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News