సృష్ఠిలో వ్యర్థం అన్నదే లేదు. ప్రతిదీ ఉపయోగపడేదే. రీసైకిల్ ప్లాస్టిక్ .. డిజిటల్ ప్రింటింగ్ కలయికతో ఇలాంటి డిజైనర్ వస్త్రాల్ని రూపొందించడం సాధ్యమా? అంటే సాధ్యమేనని అంటోంది ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్. అయితే దానికి ఐరిస్ వాన్ హెర్పెన్ లాంటి ప్రతిభావంతమైన సృజనాత్మకమైన డిజైనర్ కావాల్సిందేనని కితాబిస్తున్నారు.
చూస్తుంటే అవతార్ పండోరా గ్రహంపై ఐవాను చూసినంత కన్నుల పండుగగా ఉంది సోనమ్ లుక్. ఒక వృక్షం వేరు అక్కడి నుంచి శాఖోపశాఖలుగా విస్తరించే ఎనర్జీని చూపిస్తున్న వైనం ఆ డిజైనర్ దుస్తుల్లో కనిపిస్తోంది. ఈ డిజైన్ పుట్టుకపై సోనమ్ సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చారు. పండోరా గ్రహంపై ఐవాను తలపిస్తున్న సోనమ్! అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ క్రియేటివిటీ వెనక బ్రెయిన్ ని పొగిడేస్తున్నారు.
నేను నృత్యంపై ఒక సాధారణ ప్రేమను కలిగి ఉన్న సృజనాత్మక కుటుంబంలో పెరిగాను..ప్రకృతి అద్భుతాలపై మోహం బంధం ఉంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్పేస్ ని నిర్వచించి నాలాంటి అభిరుచితోనే ఐరిష్ కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాషన్ కోచర్ లోకి ప్రవేశించిన గొప్ప ప్రతిభాశాలి. ఐరిస్ వాన్ హెర్పెన్ పనితనం వేరే. సాంకేతికత ఫ్యాషన్ సుస్థిరత అన్నిటి కలయిక ఆమె. అందుకే ఈ డిజైన్ అంత అందంగా కుదిరింది అంటూ డిజైనర్ ఐరిష్ కి కితాబిచ్చేసింది సోనమ్.
రీసైకిల్ ప్లాస్టిక్ డిజిటల్ ప్రింటింగ్ తో కోచర్ ను సృష్టిస్తుంది ఐరిష్. దుస్తులలో గతి శక్తిని ఉపయోగిస్తుంది. సమ్మర్ 2021 స్పెషల్ ఈ దుస్తులు. మరొక ప్రపంచంలోకి నన్ను తీసుకెళుతున్నాయి. ఇక్కడ ప్రతిదీ పరిపూర్ణతతో రూపొందించిన దుస్తులు అంటూ వెల్లడించారు సోనమ్.
ప్రస్తుతం సోనమ్ కపూర్ భారతదేశానికి దూరమయ్యారు. ఆనంద్ అహుజాతో కలిసి లండన్ లోని తన కొత్త ఇంటిలో నివశిస్తున్నారు. అక్కడి నుండి ఒక నోట్ ని కూడా రాశారు. భర్త ఆనంద్ అహుజాతో కలిసి సోనమ్ కపూర్ ఒక చిత్రాన్ని పంచుకుని.. స్వదేశాన్ని మిస్సయ్యానని విచారం వ్యక్తం చేశారు. లండన్ వీధుల్లో ఆనంద్ తో కలిసి సంచరిస్తున్న ఓ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ``నేను భారతదేశాన్ని చాలా మిస్ అయ్యాను. నేను ఇంటికి తిరిగి వెళ్లి నా కుటుంబాన్ని స్నేహితులను చూడాలని ఆరాటపడుతున్నాను. కానీ నా కొత్త ఇంటిని వదిలేయలేను. నా అందమైన భర్త ఆనంద్ అహుజాను వదిలి ఉండలేను. లండన్లో ఒక చెడ్డ రోజు ఇంకా ఎక్కడైనా మంచి రోజు కంటే మెరుగ్గా ఉంటుంది`` అంటూ పోయెటిక్ గా స్పందించారు సోనమ్.