సోషల్ మీడియాకు సంబంధించిన ఒకేరోజు కొద్ది గంటల తేడాతో చోటు చేసుకున్న సంఘటనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రముఖ గాయకుడు అభిజీత్ భట్టాచార్య ట్విట్టర్ అకౌంట్ ను ట్విట్టర్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటే.. తన ట్విట్టర్ ఖాతాకు గుడ్ బై చెప్పారు మరో బాలీవుడ్ సింగర్ సోనూనిగమ్.
ఈ రోజు ఉదయం నుంచి వరుసగా ట్వీట్లు చేస్తున్న ఆయన.. తాను ట్విట్టర్ నుంచి బయటకు వెళ్లిపోతున్నానని చెబుతూ తన 70 లక్షల మంది ఫాలోయర్లకు గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా పలు ట్వీట్లు చేసిన ఆయన.. ట్విట్టర్ మాధ్యమంలో సాగుతున్న పలు విషయాల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కొన్ని విషయాల మీద ఏం మాట్లాడినా ఏమనరని.. కానీ.. మరికొందరి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందంటూ ఫైర్ అయిన ఆయన.. చాలా అంశాల్ని ప్రస్తావించటం గమనార్హం. ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్ననిర్ణయాన్ని తీసుకున్న వేళ.. సోనూనిగమ్ చేసిన ట్వీట్లలోని కొన్ని కీలక విషయాలు చూస్తే..
+ త్వరగా స్క్రీన్ షాట్లు తీసుకోండి. ఆ తర్వాత ట్వీట్లు కనిపించవు. నేను వెళ్లిపోతుంటే కొందరు శాడిస్టులు సంతోషంగా ఉంటారు. నాకో విషయం బాగా అర్థమైంది. నిద్రపోతున్న వారిని లేపగలం. కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్న వారిని లేపలేం.
+ మీడియా డివైడ్ అయిపోయింది. కొందరు జాతీయవాదులు మన చరిత్రను కొన్ని విషయాల నుంచి నేర్చుకోవాలని అనుకోవడం లేదు. నాపై చాలా మంది ప్రేమ.. అనురాగం చూపిస్తారు. మరికొందరు అకారణంగా నిందలు వేస్తుంటారు. అరుంధతి రాయ్‌కి కశ్మీర్ పట్ల ఎలాంటి అభిప్రాయమైనా చెప్పే హక్కు ఉంది. అదే సమయంలో కోట్లాది భారతీయులకు ఆమె అభిప్రాయాన్ని తప్పా? కాదా? అని చెప్పే హక్కు ఉంటుంది కదా? అభిజీత్ భట్టాచార్య ఖాతా సస్పెండ్ చేస్తే.. జేఎన్‌యూ విద్యార్థి షెహ్లా ట్విట్టర్ ఖాతాను కూడా సస్పెండ్ చేయాలి.
+ పెళ్లి చేసుకునే వారు ఎవరైనా సరే.. మీ కాబోయే పార్టనర్ ట్విట్టర్‌లో పెట్టే టైమ్ లైన్‌ను చూసి వారి మనస్తత్వం ఏమిటో తెలుసుకోండి.
+ అన్ని విషయాలను ఒకవైపే ఎందుకు ఆలోచిస్తున్నారు. అందరూ ట్విటర్‌లోనే ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ కు వ్యతిరేకిని కాను. కానీ.. ఒకవైపు మాత్రమే ఆలోచించే ప్రజలున్న ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నా. మనసున్న ఎవరైనా ఇదే చేస్తారు.
+ నాకు మతం లేదు. ఏది మంచి అనిపిస్తే అదే నా మతం. రాబోయే రోజుల్లో నా మీద ఎన్ని వివాదాలు ఉంటాయో తెలీదు. కానీ.. ట్విట్టర్ నుంచి మాత్రం ఇదే లాస్ట్ వివాదాస్పద విషయం కావాలనుకుంటున్నా.