ఓవర్ నైట్ రియల్ హీరోగా మారారు విలన్ సోనూసూద్. లాక్ డౌన్ లో కార్మికులకు అతడు చేసిన సాయం సేవ మరువలేనిది. అతడిని దేశవ్యాప్తంగా ప్రజలు అభిమానిస్తున్నారు. ఇదే అదనుగా అతడిని రాజకీయాల్లోకి లాగేందుకు ఎవరికి వారు రాజకీయ పార్టీల నాయకుల ప్రయత్నాలు అంతే ఇదిగా సాగుతున్నాయి.
కానీ సోనూ తన ఆలోచనల్ని ఇప్పటికే బయటపెట్టేశాడు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా నాయకులు ఆఫర్లు ఇస్తున్నా తనకు ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని చెప్పేశాడు. పనిలో పనిగా సోనూ సూద్ కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. అతను నిర్మాతగా మారబోతున్నాడు. సోను సూద్ స్వయంగా తన నిర్మాణ ప్రణాళికలను అంగీకరించాడు. తన సొంత బ్యానర్ సినిమాల కోసం పలు సంస్థలతో చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. తనదైన సొంత బ్యానర్ లో కొన్ని కథల్ని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయి.
సోను సూద్ తన ప్రొడక్షన్ హౌస్ `శక్తి సాగర్ ప్రొడక్షన్స్` ను స్థాపించారు. దీనికి అతని తండ్రి శక్తి సాగర్ సూద్ పేరు పెట్టారు. ఈ బ్యానర్ పై ఆయన సినిమాలు తీయబోతున్నారు. స్ఫూర్తిదాయకమైన కథలను పెద్ద తెరపైకి తీసుకురావాలనేది తన ప్లాన్. సేవా నినాదం ఉన్న చిత్రాలకు తన హోమ్ బ్యానర్ పై అధిక ప్రాధాన్యత ఇస్తామని సోను సూద్ తెలిపారు. ఈ తరహా స్క్రిప్ట్ లకు సోను సూద్ స్వయంగా ప్రధాన నటుడిగా మారబోతున్నారని తెలిసింది. కొంతమంది ప్రసిద్ధ దర్శకులు సోను సూద్ తో కలిసి పనిచేయడానికి చర్చలు జరుపుతున్నారు. పెద్ద బడ్జెట్ లతో పెద్ద కాన్వాస్ పై ఈ సినిమాలు తీయనున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం సోను సూద్ జనవరి 15 న తెరపైకి వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ `అల్లుడు అదుర్స్`లో నటిస్తున్నారు. ఈ చిత్రం కామెడీతో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్. త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయాలన్న పంతంతో ఉన్నారట. ఇక ఇంతకుముందు పీవీ సింధు బయోపిక్ విషయమై సోనూసూద్ ఎంతో ఆసక్తిని కనబరిచిన సంగతి తెలిసినదే. తానే ఈ మూవీ కోసం నిర్మాతగా అవతారం ఎత్తుతున్నానని ప్రకటించారు. దీపిక ఈ మూవీలో నటించే వీలుందని ప్రచారమైంది. ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ తెలియాల్సి ఉంది.