దేశంలో ఆక్సీజన్ కొరతతో వేలాది ప్రాణాలు పోతున్న సంగతి తెలిసిందే. హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారితోపాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కూడా ఆక్సీజన్ అందక అన్యాయంగా చనిపోతున్నారు. తాజాగా.. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు 22 మంది ఆక్సీజన్ అందక అల్లాడుతున్న విషయం తెలుసుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వెంటనే స్పందించారు.
బెంగళూరులోని ఆర్క్ హాస్పిటల్ లో ఆక్సీజన్ సిలిండర్లు ఖాళీ కావడంతో రోగులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. దీంతో.. సదరు ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని సోనూ సూద్ ఫౌండేషన్ కు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన సోనూ సూద్.. తన సిబ్బందిని అలర్ట్ చేశారు.
వారు పలు చోట్ల గాలించి కొన్ని గంటల వ్యవధిలోనే మొత్తం 15 ఆక్సీజన్ సిలిండర్లు సిద్ధం చేశారు. తనకు ఫోన్ కాల్ రాగానే.. అందులో నిజమెంత అన్నది తెలుసుకున్నామని, వాస్తవం అని తెలియడంతో.. వెంటనే సిలిండర్ సేకరించే పనిలో పడ్డామని సోనూ తెలిపారు. సకాలంలో ఆక్సీజన్ అందించి, బాధితుల ప్రాణాలు కాపాడినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఈ ‘ఆపరేషన్’ విజయంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కాగా.. కరోనా బాధితులకు విరామం అన్నదే లేకుండా సోనూ సూద్ సాయం చేస్తుండడం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇతడే నిజమైన హీరో అంటూ అభినందనలు కురిపిస్తున్నారు.