వలస కూలీలకు మాత్రమే కాదు మన వారికీ రియల్‌ హీరో అయ్యాడు

Update: 2020-07-25 10:30 GMT
కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేయకుండా లాక్‌ డౌన్‌ చేయడంతో వలస కార్మికులు రోజు వారి కూలీ పనులు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులుకు గురి అయ్యారు. వలస వెళ్లిన చోట పని లేక అక్కడ నుండి సొంత ప్రాంతాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డ వలస కార్మికుల పాలిట సోనూసూద్‌ హీరో అయ్యాడు. దాదాపుగా 30 వేల మందికి పైగా వలస కార్మికులను వారి వారి సొంత ప్రాంతాలకు సొంత ఖర్చుతో తరలించాడు. కేరళ వలస మహిళ కార్మికుల కోసం ఏకంగా విమానంను బుక్‌ చేసి గొప్ప మనసును చాటుకున్నాడు.

వలస కార్మికులు వారి వారి ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో మార్గ మద్యంలో మృతి చెందిన వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఇటీవలే ముందుకు వచ్చాడు. వారి కుటుంబంను ఆదుకునేందుకు తాను ఉన్నాను అంటూ ప్రకటించిన సోనూసూద్‌ ఈసారి తెలుగు విద్యార్థుల పాలిట దేవుడిగా మారాడు. కిర్గిస్థాన్‌ దేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 176 మంది మెడికల్‌ విద్యార్థులు ఉన్నారు. వారు అక్కడ కాలేజ్‌ లు మూత పడటంతో వెనక్కు రాలేక అక్కడే ఉండలేక నాలుగు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు.

సోషల్‌ మీడియా ద్వారా కిర్గిస్థాన్‌ రాజధాని బిష్‌ కేక్‌ లో ఉన్న తెలుగు విద్యార్థుల గురించి తెలుసుకున్న సోనూ సూద్‌ ప్రభుత్వ పెద్దలతో మరియు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి వారిని ప్రత్యేక విమానం ద్వారా వైజాగ్‌ కు రప్పించేందుకు కృషి చేశారు. సోనూసూద్‌ చర్చలతో విమాన చార్జీలు కూడా తగ్గాయని.. అక్కడ నుండి ఎలా బయట పడాలా అంటూ ఆందోళనతో ఉన్న సమయంలో సోనూసూద్‌ మాకు ఈ సాయం చేశారంటూ వైజాగ్‌ చేరిన విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులు కూడా సోనూసూద్‌ ను రియల్‌ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.
Tags:    

Similar News