ముంబై విమానాశ్రయంలో కుప్పకూలిన వ్యక్తికి CPR అందించి అతని ప్రాణాలను కాపాడాడు సోనూసూద్. ఇది తాజా సంచలనం!! నటుడు సోనూ సూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో ఎందరో ప్రజలకు ఆపద్భాందవుడిగా మారిన సంగతి తెలిసిందే. అతడి వల్ల సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన లేదా ఆస్పత్రిలో వైద్య సాయం పొందిన వారంతా తనను ఇప్పటికీ ఎప్పటికీ దేవుడిగానే ఆరాధిస్తున్నారు. సోనూ ఇటీవల గుప్తదానాలతోను మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.
తాజా సమాచారం మేరకు అతడు విమానాశ్రయంలో కుప్పకూలిన ఒక హృద్రోగిని తన చికిత్సతో బతికించాడని తెలిసింది. ఈసారి ఒక సామాన్యుడికి CPR చేయడం ద్వారా తన ప్రాణాలను కాపాడాడు. సోనూ సూద్ ఇటీవల దుబాయ్ నుండి తిరిగి వస్తున్నాడు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద ఊహించని పరిస్థితి ఏర్పడింది. క్యూలో ఉన్న ఓ నడివయస్కుడు స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయాడు.
సమయాన్ని వృథా చేయకుండా సోనూ సూద్ ఆ వ్యక్తి తలను కుషన్ పై ఉంచి..వెంటనే కార్డియోపల్మోనరీ రెససిటేషన్ (CPR)ని ప్రారంభించాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ వ్యక్తికి ఊపిరి వచ్చింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు సాధారణ ప్రజలతో పాటు అక్కడ ఉన్నవారంతా సోనూని అభినందించారు. ఆ వ్యక్తి తన ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సోనుసూద్ చివరిసారిగా అక్షయ్ కుమార్ -మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన `సామ్రాట్ పృథ్వీరాజ్`లో కీలక పాత్రలో కనిపించారు. తదుపరి భారీ యాక్షన్ డ్రామా `ఫతే`లో కనిపించనున్నాడు. కోవిడ్-ప్రేరిత లాక్ డౌన్ సమయంలో అన్ని రవాణా మార్గాలు మూసివేసిన క్రమంలో వేలాది మంది వలస కార్మికులకు వారి స్వస్థలానికి తిరిగి చేరుకోవడానికి సోను సహాయం చేసిన తర్వాత మీడియా హెడ్ లైన్స్ లో నిలిచాడు.
అంతే కాదు అతను ప్రజలకు ఆస్పత్రుల్లో పడకలు ఇంజెక్షన్లు మందులు టీకాలు ఏర్పాటు చేయడంలో సహాయం చేశాడు. అవసరమైన వారికి ఆహారం అవసరమైన నిత్యావసర వస్తువులను కూడా అందించాడు. ఇటు టాలీవుడ్ నుంచి ఎవరైనా సహాయం కోరితో లాక్ డౌన్ లో బోలెడంత సాయం చేసాడు. స్లమ్ లలో పలువురు పేదవారిని సోనూసూద్ ఆదుకుని దేవుడయ్యాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.